విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరికి బదులు రైతులు ప్రత్యామ్నాయ పంటలైన అపరాల సాగుపై ఈ రబీలో దృష్టి కేంద్రీకరించేలా వ్యవసాయ అధికారులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత సూచించారు.
మంగళవారం మధ్యాహ్నం ఆమె గూడూరు మండలం తరకటూరు గ్రామ పంచాయితీ ఆవరణలో పలువురు రైతులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, కృష్ణాజిల్లాలో రబీ 2021 పంట కాలంలో దాళ్వా వరి సాగుకు సరిపడ సాగునీరు విడుదల చేయలేని పరిస్థితులు నెలకొన్నందున రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన మినుము, పెసర, మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ, నువ్వులు ఉలవలు సాగు తదితర పంటలు పండించాలన్నారు. అలాగే రైతులకు వ్యవసాయదాధికారులు ఈ అపరాల పంటలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.
అనంతరం కృష్ణాజిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు మోహన్ కుమార్ రైతులకు పలు సూచనలు ఇచ్చారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన విధంగా మినుము రకాలైన ఎలిబిజి-752, ఎలిబిజి-787, పియూ-31, టిబిజి-104, జిబిజి-1, ఐపియూ 2-43 పెసరలో ఎల్జిజి-460 టీఎం-96-2, ఐపిఎం 2-14 రకాలను సాగు చేయాల్సిందిగా సలహా ఇచ్చారు. కృష్ణా జిల్లాలో అత్యధిక శాతం మంది రైతులు తాము స్వయంగా పండించిన విత్తనం వాడటం అనేది సర్వ సాధారణమన్నారు. మినుములో పియూ-31, ఎసర ఐపిఎం 2-14 కావలసిన రైతులు తమ పేర్లను సంబంధిత రైతు భరోసా కేంద్రంలో డి-కృషి యాప్ ద్వారా వెంటనే రిజిస్టర్ చేసుకుని 30 శాతం సబ్సిడీ పోను చెల్లించాల్సిన సొమ్మును ఇచ్చి మేలు రకాలైన విత్తనము లను తీసుకొనవలసినదిగా కోరారు.
అలాగే మొక్కజొన్న మరియు జొన్న విత్తనాలను రైతు భరోసా కేంద్రంలలోని కియోస్క్ లలో పూర్తి ఖరీదుపై ఆర్డర్ బుక్ చేసుకుని నాణ్యత దృవీకరించబడిన విత్తనాలను తీసుకొనవలసినదిగా ఆయన సూచించారు. అదేవిధంగా నువ్వులు, ఉలవలు, పిల్లిపెసర ,జనుము విత్తనాలపై సబ్సిడీ విధివిధానాలు, వివిధ రకాల విత్తనాల లభ్యత ఈ వారంలో రావలసి ఉన్నదని జాయింట్ డైరెక్టర్ తెలిపారు.
తర్వాత మచిలీపట్నం ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి మాట్లాడుతూ, వ్యవసాయ అధికారులు,శాస్త్రవేత్తలు సూచించిన విధముగా వరికి బదులుగా ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను ఎంపిక చేసుకుని రబీ సాగు చేసుకోవలసినదిగా రైతులకు తెలిపారు.రబీ పంటలో ఏదైనా సలహా సూచనలు కోసం మీ గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో లేదా మీ మండల వ్యవసాయ అధికారిని గాని సంప్రదించలన్నారు. అలాగే , వ్యవసాయధికారులు రైతులకు అందుబాటులో ఉండి రబి సాగులో సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. విత్తనాల నాణ్యతపై, పంటలకు మార్కెట్లో ఉండే ధరలు, వచ్చే లాభాల గురించి సవివరంగా అన్నదాతలకు వివరించాలన్నారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …