విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గవర్నర్ పేట సి.వి.ఆర్ నగరపాలక సంస్థ హై స్కూల్ నందు జరుగుతున్న అభివృధి పనులను శుక్రవారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా టాయిలెట్స్ పనులు సత్వరమే పూర్తి చేయునట్లుగా చూడాలని అన్నారు. ఇంకను ఏమైనా చిన్న చిన్న పనులు ఉన్నచో వాటిని కూడా చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పాఠశాలలో ఎక్కడైనా చెత్త మరియు పనిరాని సామాగ్రి ఉన్నచో వాటిని తొలగించి అన్ని తరగతి గదులు పరిశుభ్రంగా ఉంచాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. 14వ ఆర్ధిక సంఘ నిధులతో చేపట్టిన స్కూల్ బిల్డింగ్ పనులను పరిశీలించి సత్వరమే పూర్తి చేసి అందుబాటులోనికి తీసుకురావాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను ఆదేశించారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డా.వి.రామకోటేశ్వర రావు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …