విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
72 వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను స్థానిక టిడ్కో కేంద్ర కార్యాలయంలో సంస్థ డైరెక్టర్స్ సమక్షంలోచైర్మన్ జమ్మన ప్రసన్న కుమార్ అధ్యక్షతన ఘనంగా శుక్రవారం నాడు జరుపుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సంస్థ చైర్మన్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో ప్రతి పౌరుడు సమ సమాజంలో స్వేచ్చగా సమానత్వంతో, సౌభ్రాత్రుత్వంతో జీవించడం జరుగుతోందని, అంత గొప్పదైన రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించిన అంబేద్కర్ ను స్మరించుకోవడం మన ధర్మం అని కొనియాడారు.
అలాగే ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి కూడా భారత రత్న బాబా సాహెబ్ భీంరావ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారని, అంబేద్కర్ భావజాలంతో దేశం మొత్తం మన రాష్ట్రం వైపే చూసి గర్వించేలా చేసిన ఘనత ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. ఈ వేడుకలో టిడ్కో రాష్ట్ర డైరెక్టర్స్ తో బాటు సిబ్బంది అంతా పాల్గోవడం జరిగింది. కార్యక్రమ ఆరంభంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …