-ప్రస్తుతం ప్రభుత్వం పరిస్థితి పులి పై స్వారీ ని ప్రతిబంభిస్తోంది…
పశ్చిమగోదావరి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వేల కోట్లు సంక్షేమ పధకాలు రూపంలో ప్రజలకు అందచేస్తున్నా ఓటీఎస్ వంటి పధకాలు కోసం రుసుముల ను విధించడం పై సర్వత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం వాస్తవం. ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నా.. పేద, నిరుపేద మహిళలు కోసం, వెనుక బడిన తరగతుల కుటుంబాల కోసం సుమారు రూ.1,80,000 వేల కోట్లు వెచ్చించి నట్లు, ఎన్నికల హామీ లో 90 శాతం పైగా నెరవేర్చినట్లు, ఇవ్వని ఎన్నో పధకాలను ప్రవేశ పెట్టినట్లు చెపుతున్నారు. వాస్తవంగా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ ఆర్ధిక కార్యక్రమాలు, పధకాలు అమలు ఎప్పుడు చూడలేదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని స్వయంగా మంత్రులే చెబుతూ, ఏ ఒక్క పధకం ఆపడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా సామాజిక పెన్షన్లను రూ.250 వరకు పెంచుతూ పోతామన్న హామీ మేరకు 2021 జులై నుంచి అమలు కాలేదు.. సెప్టెంబర్ నెలలో వేచి చూసారు అప్పుడు అమలు కాలేదు. ఉద్యోగస్తులు కూడా పీఆర్సీ తదితర అంశాలపై పోరుబాట దిశగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ క్యాలెండర్ ప్రకారం పధకాలు అమలు చేస్తున్నా.. అభివృద్ధి, ఆదాయ వనరులు పెంపు విషయంలో అనుభవ రాహిత్యం పై ముఖ్యమంత్రి పై విమర్శలు వచ్చిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్న ఆర్థిక చేయూతతో కూడిన పధకాలు కొనసాగింపు “పులిపై స్వారీ ” లా పరిగణించే పరిస్థితి లో ఉందని ప్రజలు చర్చింకుంటున్నారు.