విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అని,గెలుపోటములతో సంబంధం లేకుండా అంతటా సమ అభివృద్ధి జరగాలి అనేదే జగన్ గారి లక్ష్యం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం 9వ డివిజన్, 20లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించబోయే పలు నూతన రోడ్లకు అవినాష్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పూజ కార్యక్రమలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంత అభివృద్ధి గురుంచి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి కాలనీ పెద్దలు, ప్రజలు ఎన్నిసార్లు తీసుకెళ్లిన కాలయాపన చేసారే తప్ప పట్టించుకోలేదు అని, వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలోనే నియోజకవర్గంలో దాదాపు 350 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నాతో పాటు,లక్షలాది మంది ప్రజలు సమర్దిస్తున్నారని,రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉంటారని ఉద్ఘటించారు. ఇక్కడి షో మాస్టర్, టీడీపీ నాయకులు వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టు కలలు కంటున్నారని అది ఎన్నటికీ జరగదు అని, గతంలో మీరు చేసిన అవకతవకలు వల్లనే నేడు కరెంట్ చార్జీలు సర్దుబాటు చేయాల్సి వస్తుంది అని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్లారని విమర్శలు చేశారు. గత ప్రభుత్వ తప్పులు వలన విధించిన ట్రూ అప్ చార్జీలను కూడా ఈ నెల కరెంట్ బిల్లులలో సర్దుబాటు చేసి ప్రజల పైన భారం పడకుండా చేసినందుకు వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు.అదేవిధంగా సాంకేతిక కారణాల వలన పెన్షన్ కోల్పోయిన వారికి సంబంధిత అధికారులతో మాట్లాడి దాదాపు 1100 మందికి పెన్షన్ పునరుద్ధరణ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం, 9వ డివిజన్ ఇంచార్జ్ వల్లూరు ఈశ్వర ప్రసాద్,సుబ్బరాజు, కన్నబాబు, కాళీ, హరీష్, చల్లారావు, గల్లా రవి, మరియు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News