Breaking News

ఈనెల 16న ఆలిండియా క్రిస్టియన్ ఫేడరేషన్ ఆధ్వర్యంలో సెమిక్రిస్మస్ వేడుకలు : ఇశ్రాయేల్ మొవ్వ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తుమ్మల పల్లి కళాక్షేత్రంలో ఈనెల 16 వ తారీఖున నాలుగు గంటలకు ఆలిండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఎఅసియఫ్ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలిండియా క్రిస్టియన్ ఫెడరేషన్ సభ్యులు ఇశ్రాయేల్ మొవ్వ తెలిపారు. మంగళవారం స్థానిక గాంధి నగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 16 తేధిన జరగనున్న సెమిక్రిస్మస్ వేడుకలకు ముఖ్య ప్రసంగీకులుగా ఎఐసిఎఫ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డైరెక్టర్ మిషన్ ఇమ్మానియేల్ పాల్గోంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోం శాఖ మాత్యులు సుచరిత, దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, రెండుసార్లు స్థానిక ఎమ్మెల్యేలు, విజయవాడ నగర మేయరు భాగ్యలక్ష్మి, నేషనల్ ప్రెసిడెంట్ గద్దపాటి విజయరాజు, జాకబ్ శామ్యూల్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర దైవజనులు మరియు క్రైస్తవ సంఘ నాయకులు అత్యధిక పాల్గొనంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐసీయఫ్ చైర్మన్ కొర్నేలి యస్, ఇశ్రాయేలు రాజు ఎలీషా లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *