Breaking News

స్పందన ద్వారా 13 ఆర్జీలు స్వీక‌రణ, అర్జీలు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలి… : కమిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో వ‌చ్చిన‌ అర్జీలు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని న‌గ‌రపాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌సన్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్‌. అధికారుల‌కు సూచించారు. సొమ‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో నిర్వ‌హించిన స్పంద‌న కార్య‌క్ర‌మంలో క‌మిష‌న‌ర్ ప్ర‌సన్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్‌. ఉన్న‌తాధికారులతో క‌లిసి ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించి, వారి యొక్క సమస్యల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. కాగా నేటి స్పందన కార్యక్రమములో ఇంజనీరింగ్ విభాగం – 2, పట్టణ ప్రణాళిక విభాగం – 3, పబ్లిక్ హెల్త్ విభాగం –3, రెవెన్యూ విభాగం – 4, యు.సి.డి విభాగం – 1, మొత్తం 13 అర్జీలు స్వీక‌రించుట జరిగింది. కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఎస్. ఇ నరశింహరావు, ఎస్టేట్ అధికారి శ్రీనివాస్, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 8 అర్జీలు 
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 1 కార్యాలయంలో 2 అర్జీలు, పట్టణ ప్రణాళిక విభాగం – 1, యు.సి.డి విభాగం -1, సర్కిల్ – 2 కార్యాలయంలో 3 అర్జీలు, పట్టణ ప్రణాళిక విభాగం – 1, ఎడ్యుకేషన్ విభాగం -1, ఇంజనీర్ విభాగం-1, సర్కిల్ – 3 కార్యాలయంలో 3 అర్జీలు రాగా ఇంజనీరింగ్ విభాగం -1, పట్టణ ప్రణాళిక విభాగం –1 మరియు రెవిన్యూ విభాగం – 1 మొత్తం సర్కిల్ కార్యాలయాల్లో 8 అర్జీలు అందించుట జరిగిందని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.

Check Also

యధావిధిగా సెప్టెంబరు 23 సోమవారం “పీజీఆర్ఎస్ ‘మీ కోసం”

-జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *