Breaking News

కోవిడ్‌ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో కోవిడ్‌ విస్తరణ పరిస్థితులను అధికారులు వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. రెండో వేవ్‌తో పోల్చిచూస్తే.. ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సకోసం పడకల సంఖ్యను కూడా పెంచి సిద్ధం చేశామని అధికారులు పేర్కొన్నారు. అన్నిజిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కోవిడ్‌ కేసుల్లో ఆస్పత్రుల్లో దాదాపు 27వేల యాక్టివ్‌ కేసుల్లో కేవలం 1100 మంది మాత్రమే ఆస్పత్రి పాలయ్యారని వివరించారు. ఇందులో ఆక్సిజన్‌ అవసరమైన వారి సంఖ్య సుమారు 600 మంది మాత్రమేనని అధికారులు తెలిపారు.

ఈమేరకు వైద్య పరంగా అవసరాలను గుర్తించాలని.. ఆ మేరకు ఆక్సిజన్‌ను, మందులను సిద్ధం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. గతంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలంటే కనీసం 14 రోజులు ఉండేదని, ఇప్పుడు వారం రోజులకు ముందే డిశ్చార్జి అవుతున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి ఒక కోవిడ్‌కేర్‌ సెంటర్‌ను గుర్తించామని.. సుమారు 28 వేల బెడ్లను సిద్ధంచేశామని అధికారులు తెలిపారు.

104 కాల్‌సెంటర్‌పైనా సీఎం సమీక్ష
– కాల్‌సెంటర్‌ పటిష్టంగా పనిచేయాలని అదేశం.
– టెలిమెడిసిన్‌ ద్వారా కాల్‌చేసిన వారికి వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.

ప్రికాషన్ డోస్‌ వ్యవధి..
– ప్రికాషన్‌ డోస్‌ వేసుకునేందుకు ఇప్పుడున్న 9 నెలల వ్యవధిని 6 నెలల వ్యవధికి తగ్గించాలంటూ కేంద్రానికి లేఖరాయాలని సీఎం నిర్ణయం.
– ఈ వ్యవధిని 3 నుంచి 4 నెలలు తగ్గించే దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి లేఖరాయాలని సీఎం నిర్ణయం
– దీనివల్ల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, అత్యవసర సర్వీసులు అందిస్తున్న వారికి ఉపయోగమని సమావేశంలో అభిప్రాయం
– అంతేకాకుండా ఆస్పత్రిపాలు కాకుండా చాలామందిని కోవిడ్‌నుంచి రక్షించే అవకాశం ఉంటుందన్న సమావేశంలో నిర్ణయం

వ్యాక్సినేషన్‌
–రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌లో మిగతా జిల్లాలతో పోలిస్తే కాస్త దిగువన ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం

– 15 నుంచి 18 ఏళ్లవారికీ 100శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తిచేసిన నెల్లూరు, ప.గో. జిల్లాలు.
– మరో 5 జిల్లాల్లో 90 శాతానికిపైగా ఈ వయసులవారికి వ్యాక్సినేషన్‌ పూర్తి.
– నాలుగు జిల్లాల్లో 80శాతానికిపైగా వ్యాక్సినేషన్‌.
– మిగిలిన జిల్లాల్లోనూ ఉద్ధృతంగా వ్యాక్సినేషన్‌ చేయాలని సీఎం ఆదేశం.
– వ్యాక్సినేషన్‌లో మిగిలిన జిల్లాలతో పోలిస్తే తక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.

కోవిడ్‌ పరీక్షల్లో కేంద్రం కొత్త మార్గదర్శకాలపైనా సమావేశంలో చర్చ
– కోవిడ్‌ లక్షణాలు లేనివారికి ఎలాంటి పరీక్షలు చేయొద్దని ఐసీఎంఆర్‌ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొందని తెలిపిన అధికారులు.
– కోవిడ్‌ పాజిటివ్‌ తేలినవారి కాంటాక్ట్స్‌లో కేవలం హైరిస్క్‌ ఉన్నవారికి పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్‌ స్పష్టంచేసిందని తెలిపిన అధికారులు.

కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణ ప్రగతిపైనా సీఎం సమీక్ష.
– ఆరోగ్య శ్రీపై పూర్తి వివరాలు తెలిపేలా విలేజ్, వార్డ్‌ క్లినిక్స్‌లో, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెద్ద హోర్డింగ్‌పెట్టాలని సీఎం ఆదేశం
– ఆరోగ్య శ్రీ రిఫరల్‌ పాయింట్‌గా క్లినిక్స్‌ వ్యవహరించాలని, వైద్యంకోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై పూర్తి వివరాలతో సమాచారం లభించాలని సీఎం ఆదేశం.

ఆరోగ్యశ్రీ రిఫరల్‌ సిస్టం– ఎస్‌ఓపీ
– ఆరోగ్యశ్రీ కింద పేషెంట్‌ రిఫరల్‌వ్యవస్థపై రూపొందించిన స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను సమగ్రంగా సమీక్షించిన సీఎం.
– నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలకు, గ్రామ–వార్డు సచివాలయాల్లో ఆరోగ్య మిత్రలకు, పీహెచ్‌సీ ఆరోగ్య మిత్రలకు, 104 మెడికల్‌ ఆఫీసర్‌కు, 108 మెడికల్‌ ఆఫీసర్‌కు రూపొందించిన ఎస్‌ఓపీలను పరిశీలించిన సీఎం.
విలేజ్‌ క్లినిక్‌లలో శాశ్వతంగా హోర్డింగ్‌ ఏర్పాటుచేయాలన్న సీఎం
అత్యవసర వైద్య సేవలు కావాల్సిన వచ్చినప్పుడు ఎవరిని, ఎలా సంప్రదించాలనేది స్పష్టంగా తెలియాలన్న సీఎం
విలేజ్‌ క్లినిక్‌తో పాటు సచివాలయం, రైతు భరోసా కేంద్రాలలో కూడా హోర్డింగ్‌ ఏర్పాటుచేయాలన్న సీఎం
– ఆరోగ్య శ్రీ కింద రోగులకు సమర్థవంతంగా సేవలందించాలన్న సీఎం.
– విలేజ్‌క్లినిక్‌కు వెళ్లినా, పీహెచ్‌సీ, నెట్‌వర్క్‌ ఆస్పత్రి … ఇలా పేషెంట్‌ ఎక్కడకు వెళ్లినా.. వారి ఆరోగ్య పరిస్థితిని వెంటనే తెలుసుకుని, వైద్యంకోసం ఎక్కడకు పంపాలన్న విధానం చాలా పటిష్టంగా ఉండాలన్న సీఎం.
– 104, 108, పీహెచ్‌సీలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో ఉండే డాక్టర్లు కూడా ఈ ప్రక్రియలో భాగమయ్యేలా, వారికి మంచి సేవలు అందించేలా ఈ రిఫరెల్‌ విధానం ఉండాలన్న సీఎం
– ఆరోగ్య మిత్రలు కీలకంగా వ్యవహరించాలన్న సీఎం
– ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ సేవల సమన్వయం కోసం యాప్‌ పనిచేయాలన్న సీఎం.
108 కు కాల్‌ చేసినా, ఆరోగ్య మిత్ర రిఫర్‌ చేసినా ఈ యాప్‌ దగ్గరలో ఉన్న నెట్‌వర్క్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేస్తుందన్న అధికారులు
పేషెంట్‌ వివరాలతో పాటు ఫోటో కూడా డౌన్లోడ్‌ చే యాలన్న సీఎం
దీనివల్ల పేషెంట్‌ పరిస్థితి కూడా తెలుస్తుందన్న సీఎం
అదే సందర్భంలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) వినియోగంపై కూడా దృష్టి పెట్టాలన్న సీఎం
ఏఐ వినియోగంతో వ్యవస్ధ మరింత బలపడుతుందన్న సీఎం
రిఫరల్‌ వ్యవస్ధలో ఏఐ వాడగలిగితే మరింత పారదర్శకంగా ఉంటుందన్న సీఎం
నెట్‌ వర్క్‌ ఆస్పత్రిలో చికిత్సతో పాటు ఆరోగ్య ఆసరా అందించిన అనంతరం ఇంటికి వెళ్లిన పేషెంట్‌ ఆరోగ్య పరిస్థితిపై ఏఎన్‌ఎం ఆరా తీరాయలన్న సీఎం
దీంతో పాటు మరలా ఎలాంటి సమస్య వచ్చినా అందుబాటులో ఉంటామన్న విషయాన్ని తెలిపాలన్న సీఎం
ఇది పేషెంట్‌కు గొప్ప ధైర్యాన్నిస్తుందన్న సీఎం

ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్‌) రవిశంకర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *