మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ సచివాలయ సిబ్బంది కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు.
మచిలీపట్నం మండల పరిధిలోని పెదపట్నం, కానూరు, తపసిపూడి గ్రామ సచివాలయాలను సందర్శించి వాలింటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాక్ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను సచివాలయం బయట ప్రదర్శించాలన్నారు. సచివాలయ పరిధిలో 18 సంవత్సరాల పైబడిన వారికి ఎంత మందికి వ్యాక్సిన్ ఇచ్చారు వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని సచివాలయ సిబ్బందిని ఏఎన్ఎంను ఆదేశించారు . గ్రామ సచివాలయం పరిధిలో 18 సంవత్సరాల నుంచి 45 సం ల లోపు ఉన్న వారు, గర్భవతులు అందరికీ మోటివేషన్ చేసి వ్యాక్సినేషన్ వేయించాలని ఏఎన్ ఎం కు సూచించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటు లో ఉండి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ప్రస్తుత సమయంలో ఓ మిక్రాన్ కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామంలో విదేశాల నుండి వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారిని హోమ్ క్వారేంటీన్ లో ఉంచి పరీక్షలు కూడా నిర్వహించాలని సచివాలయ మహిళా పోలీసులను ఏఎన్ఎం లను ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.గ్రామంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారు, ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు సర్వే చేశారు, వెరిఫికేషన్, డేటా ఎంట్రీ ఎన్ని చేశారు వంటి వివరాలను విఆర్ ఓ, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీర్ అసిస్టెంట్, హౌసింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు సర్వే ను త్వరితగతిన పూర్తి చేయాలని పైకం చెల్లించే వారికి సచివాలయాల ద్వారానే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలన్నారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం నూరు శాతం విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని వేగవంతం చేయాలన్నారు సంపూర్ణ గృహహక్కు పథకంలో సుముఖత ఉన్న వారితో మాత్రమే డబ్బు తీసుకోవాలని, ఈ విషయంలో ఒక్కరిని బలవంతం పెట్టవలసిన అవసరం లేదన్నారు. పంచాయతీ సెక్రెటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను డేటా ఎంట్రీ పై దృష్టి సారించేలా చేసి డేటా ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విఆర్వో లాగిన్ లో ఉన్న లబ్ధిదారుల జాబితాను కూడా వెంటనే అప్రూవల్ చేయాలన్నారు. వన్టైమ్ సెటిల్మెంట్ పథకం నిర్ణీత కాల వ్యవధిలో అమలు చేయడం జరుగుతుందని, ఈ పథకాన్ని ఉపయోగించుకునేలా చేయాలన్నారు. అతి తక్కువ రుసుంతోనే, శాశ్వత హక్కును సంపాదించే ఈ పథకం క్రింద, ఎటువంటి రిజిష్ట్రేషన్ ఛార్జీలను చెల్లించనక్కరలేకుండానే, తమ గ్రామ, వార్డు సచివాలయంలోనే రిజిష్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు. రిజిష్ట్రేషన్ అనంతరం తమ ఇంటిని లేదా స్థలాన్ని అవసరమైతే బ్యాంకులో తనఖా పెట్టుకోవచ్చునని, లేదా కొత్తగా రుణాన్ని తీసుకోవచ్చని సూచించారు. ఒకే విడతలో తమ రుణాన్ని, వడ్డీని పూర్తిగా మాఫీ చేసుకొని, ఇంటిపై సంపూర్ణ హక్కులను కలిగించే ఈ గొప్ప అవకాశాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ పధకం ప్రయోజనాలను లబ్ధిదారులకు తెలియజేసి ఈ పథకాన్ని వారు సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం అమలును వేగవంతం చేయాలని, సచివాలయ సిబ్బందిని మంత్రి పేర్ని నాని ఆదేశించారు. ఓటిఎస్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించి, దీనిని సద్వినియోగం చేసుకొనేలా చూడాలని అన్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు.
ఈ సచివాలయాల సందర్శనలో పెదపట్నం గ్రామా సర్పంచ్ గడదేశి అనూషా డేవిడ్ రాజు, కె డి సి సి బ్యాంకు డైరెక్టర్ గడదేశి బాలజేసు , వాలిశెట్టి రవిశంకర్ పలువురు వైఎస్సార్ పార్టీ నాయకులు గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …