Breaking News

పిఆర్సీతో ఉద్యోగులకు తీవ్ర నష్టం..

-జిల్లా జేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
11వ పిఆర్సి అమలుపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి విడుదల చేసిన ఉత్తర్వుల వలన ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వేతన సవరణ లో ఉద్యోగుల జీతాలు పెరగకపోగా తగ్గుతున్నాయని దశాబ్దాల సంఘాలు పోరాడి సాధించుకున్న ప్రివిలేజెస్ ను ఉద్యోగ వర్గాలు శాశ్వతంగా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఏపీ ఎన్టీవో సంఘ కృష్ణాజిల్లా అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ ఏ.విద్యాసాగర్ కార్యదర్శి ఎండి ఇక్బాల్ తెలిపారు. పిఆర్సి పై ప్రభుత్వ ఉత్తర్వులు ప్రధానాంశంగా గాంధీనగర్‌లోని ఎన్టీవో హోంలో ఎన్జీవో అసోసియేషన్ జిల్లా మరియు నగర కార్యవర్గ సభ్యులు ఇతర నాయకులతో జరిగిన సమావేశంలో జేఏసి నేత ఏ. విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగుల పి ఆర్ సి చరిత్రలో ఐఆర్ కన్నా తక్కువ ఫిట్మెంట్ ను పొందడం ఇదే మొదటిసారని అలాగే ఎన్నో దశాబ్దాలుగా ఉద్యోగులు పొందుతున్న హెచ్ ఆర్ ఏ స్లాబ్ ను తగ్గించటం ఉద్యోగులను తీవ్ర నష్టానికి గురి చేస్తుందని ముఖ్యంగా జిల్లా హెడ్ కోటర్స్‌లో ఉండి 20 శాతం పొందుతున్న ఉద్యోగులు ఇప్పుడు 8 శాతానికి పరిమితం అవుతారని అలాగే విజయవాడ విశాఖపట్నం నగరాలకు సంబంధించి పిఆర్సి కమిషనర్ ఇప్పుడు ఉన్న 20% ను 22 శాతానికి పెంచుతూ రిపోర్టు ఇచ్చారని కానీ ప్రభుత్వం విజయవాడకు 16 శాతం హెచ్ ఆర్ ఏ ను ఇవ్వటం ఉద్యోగులకు శాశ్వత నష్టాన్ని కలిగిస్తుందని గత ప్రభుత్వాలు ఇచ్చిన సిసి ఏ ను రద్దు చేయటం శోచనీయం అని ఇది ఉద్యోగుల చరిత్రలో చీకటి రోజు అని తెలిపారు. గత 50 సంవత్సరాలుగా అనేక పోరాటాల ఫలితంగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఉద్యోగులకు సాధించి పెట్టిన అనేక రాయితీలు, సాంప్రదాయాలను, అగ్రిమెంట్ లను ఈ ఉత్తర్వులు కాలరాస్తున్నాయని, ఈ పి ఆర్ సి వలన ముందు ఇతర ఉద్యోగులకు కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న విషయం నాయకులను బాధిస్తుందని తెలిపారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఇది ఉద్యోగులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కు అని ఇవాళ పిఆర్సి కమిటీని అపాయింట్ చేయకుండా మున్ముందు పది సంవత్సరాలకు ఒక పీఆర్సీని వేస్తాను అని చెప్పటం, 2023 లో మరొక పిఆర్సి రావాల్సి ఉన్నా ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని తెలిపారు. పెన్షనర్లకు కూడా ఉన్న రాయితీలను కోల్పోతున్నారని వారికి అవి కేవలం నష్టాన్ని కలిగిస్తాయి అని తెలిపారు.

జిల్లా కార్యదర్శి ఎండి ఇక్బాల్ మాట్లాడుతూ ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అసలీ పిఆర్సి ఏ వద్దు ఇది రివర్స్ పిఆర్సి అంటున్నారని ముఖ్యంగా పెన్షనర్లకు 70 , 75 సంవత్సరాలకు వున్న వెయిటేజీని తొలగించడం గత ప్రభుత్వాల హయాంలో అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న రాయితీ లన్నిటిని ఈ ఉత్తర్వుల ద్వారా తొలగించడం చాలా అన్యాయమైన విషయమని తెలిపారు. జూన్‌ 2019 నుంచి ఇచ్చిన ఐఆర్‌ను డీజే బకాయిల అమౌంట్ నుంచి మినహాయింపు కూడా ఇంతవరకు ఎప్పుడూ ఎరుగని తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్జీవోలు వివిధ డిపార్ట్మెంట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డిపార్ట్మెంట్లో ఈ ఉత్తర్వులు వలన అసంతృప్తిని ఆవేదనను ఉద్యోగ నాయకులు ముందు వెళ్లగక్కారు. విజయవాడ నగర శాఖ ఎన్జీవోసంఘ అధ్యక్షుడు స్వామి మాట్లాడుతూ 11వ పి ఆర్ సి పీడకలగా మారిందని, పీఆర్సీ ఉత్తర్వులు ఇచ్చిన వేతన సవరణను తీసుకోవడం కంటే తీసుకోకుండా ఉండటమే ఉత్తమమని తేల్చి చెప్పారు. నగర కార్యదర్శి కె.సంపత్ కుమార్ మాట్లాడుతూ ఏ రకంగానూ ఏ క్యాడర్ కు కూడా వీటి వలన ప్రయోజనం లేదని చెప్పారు. అన్ని వర్గాల ఉద్యోగులు ప్రబుత్వం విడుదల చేసిన పి ఆర్ సిజ ఓలు పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల వెలిబుచ్చిన అభిప్రాయాలు పెద్ద ఎత్తున పెల్లుబికిన అసంతృప్తిని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర జేఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ ఉద్యోగులకు సర్ది చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోలను ఉపసంహరించుకుని రాష్ట్ర ఎన్జీవో అసోసియేషన్ మరియు ఉద్యోగులు కోరుకున్న విధంగా గా ఉత్తర్వులు ఇవ్వాలని ఇది సాధించే వరకు తగ్గే సమస్య లేదని విద్యాసాగర్, ఇక్బాల్ లు తేల్చి చెప్పారు.

సమావేశంలో నేతలు పి.రమేష్‌, సిహెచ్ శ్రీరామ్, ఎం రాజుబాబు, సిహెచ్ మధుసూదన్, దిలీప్‌కుమార్, డి.విశ్వనాధ్, సి.హెచ్ అప్పారావు, నగర నేతలు నజీరుద్దీన్, బి.వి.రమణ, వి.వి.ప్రసాద్, నాగరాజు, రవి, నాగరాజు, గణేశ్, దుర్గారావు, శివలీల, తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *