నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఉప రాష్ట్రపతి ముప్పవరవు వెంకయ్యనాయుడు కృష్ణాజిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని బుధవారం ఉదయం 6 గంటలకు నూజివీడు రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో విశాఖపట్టణం బయలుదేరి వెళ్లారు. నూజివీడు రైల్వే స్టేషన్ లో రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కి పుష్పగుచ్చాన్ని అందించి వీడ్కోలు పలికారు. రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్, జిల్లా కలెక్టర్ జె నివాస్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ , రైల్వే డి ఆర్ ఎం శివేంద్ర మోహన్ లు ఉప రాష్ట్రపతికి పుష్పగుచ్చాలు అందించారు. కార్యక్రమంలో ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ శర్మ నూజివీడు ఆర్టీవో కె. రాజ్యలక్ష్మి డి ఎస్ పి బి శ్రీనివాసులు, రెవిన్యూ, పోలీస్, రైల్వే సిబ్బంది ప్రభృతులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం స్వర్ణభారతీ ట్రస్ట్ లో రాహ్త్ర దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర గవర్నర్ కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, జిల్లా కలెక్టర్ జె.నివాస్, ప్రభృతులు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు.
Tags nuzividu
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …