ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
దివ్యాంగ పిల్లలకు విద్యను అందించే ప్రత్యేక పాఠశాలలో అన్ని వసతులు కల్పించి ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని అన్నమ్మ దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలను విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని పిల్లలతో ఆయన ముచ్చటించి పాఠ్యాంశాలను ఏ విధంగా బోధిస్తున్నారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని అన్ని గదులను, వంటశాలను, వాష్ రూమ్ లను సబ్ కలెక్టర్ ప్రవీణ్ తనిఖీ చేశారు. పిల్లలకు కొత్త యూనిఫారాలు అందించాలని, వాష్ రూమ్ లను సక్రమంగా నిర్వహించాలని, పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలని సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పాఠశాలలోని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పాఠశాల పరిసరాలు ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని, పిల్లలకు పోషకాహారం తో కూడిన ఆహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.
Tags ibrahimpatnam
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …