అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చైర్మన్ సహా 16మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీనీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.ఈమేరకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు జిఓఆర్టీ సంఖ్య 7 ద్వారా ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.ఈ హజ్ కమిటీకి ఎపి స్టేట్ వక్ప్ బోర్డు అధ్యక్షులు(ప్రస్తుతం కాంపిటెంట్ అధారిటీ ద్వారా నిర్వహించబడుతోంది)గా ఉంటారు.ఎగ్జిక్యూటివ్ అధికారి స్టేట్ వక్ప్ బోర్డు హజ్ కమిటీకి ఎక్స్ అఫీసియో సభ్యులుగా మరియు సభ్యకార్యదర్శిగా వ్యవహరించనున్నారు.ఇంకా ఈస్టేట్ హజ్ కమిటీలో మున్నీర్ భాషా,మహ్మద్ నవాజ్ భాషా(ఎంఎల్ఏ),షేక్ ఇసాక్ భాషా(ఎంఎల్సి), మొహమ్మద్ ఇమ్రాన్(కార్పొరేటర్),షేక్ హతవుల్లా(ఎంపిటిసి),షేక్ గులాబ్జన్(కౌన్సిలర్), సయ్యద్ వలీలుల్లా హస్సేన్-హి-సున్నాత్ వాల్ జామత్,ముప్తీ అబ్దుల్ బాషిత్-తబ్లిక్ జామత్,మౌలానా షేక్ మన్జూర్ అహ్మద్-హీల్-హదీస్,షేక్ ఖాదర్,మొహ్మద్ ఇబాదుల్లా,షేక్ మొహ్మద్ భాషా,మొహ్మద్ తారీఖ్,బద్వేల్ షేక్ గౌష్ లాజమ్ లు రాష్ట్ర హజ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
Tags AMARAVARTHI
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …