అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం ముంబైలో తుది శ్వాస విడిచిన ప్రముఖ గాయని భారతరత్న లతా మంగేష్కర్ కు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు ఘనంగా నివాళులు అర్పించారు. గానకోకిల లతా మంగేష్కర్ పాడిన వేలాది పాటలు చిరస్మరణీయమని, ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని ఆవేదనను ఆయన వ్యక్తంచేశారు. సోమవారం అమరావతి సచివాలయం 3 వ బ్లాక్ లో యూత్ అడ్వాన్సుమెంట్, టూరిజం అండ్ కల్చర్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్, క్రీడా శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అద్యక్షుడు కె.వెంట్రామిరెడ్డి తదితరులతో కలసి మంత్రి లతా మంగేష్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, ఆమె ఆత్మకు శాంతి కలగాలని కొంతసేపు మౌనాన్ని పాటించారు.
ఈ సందర్బంగా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ క్వీన్ ఆఫ్ ది ప్లే బ్యాక్ సింగర్ గా పేరుగాంచిన లతా మంగేష్కర్ సుమారు ఏడు దశాబ్దాలపాటు తన కోకిల కంఠంతో ఓలలాడించిన మధుర గాయని అని, 20 భాషల్లో సుమారు వేయి చిత్రాల్లో 50 వేల పాటలకు పైబడి పాడి దేశంలోనే అత్యన్నతమైన పురస్కారం భారతరత్నను పొందడమే కాకుండా మరెన్నో బిరుదులను, అవార్డులను కైవసం చేసుకున్న మహా గాయని అని ప్రశంసించారు. సుప్రసిద్ద సంగీతకారుడు దీనానాధ్ పెద్ద కుమార్తె అయిన ఈమె జీవితం కళామాతల్లి సేవలకే అంకితం అయిందని కొనియాడారు. దేశభక్తిని ప్రస్పుటించేలా ఆమె చేసిన గీతాలాపన ఎప్పటికీ చిరస్మరణియమేనని ప్రశంసించారు.
యూత్ అడ్వాన్సుమెంట్, టూరిజం అండ్ కల్చర్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్ మాట్లాడుతూ 1942 లో తొలిసారిగా పాటలు పాడటం ప్రారంభించిన భారతరత్న లతా మంగేష్కర్ సుమారు మూడు, నాలుగు తరాల వారిని తమ మధుర గానంతో ఓలలాడించిన మహాగాయని ఆయన కొనియాడారు. 30 సంవత్సరాల క్రితం ఆమెను ఒక సారి కలిశానని, ఎటు వంటి అహకారం లేని ఎంతో నిరాడంబరని ప్రశంసించారు. ఆమె సత్ ప్రవర్తన, మంచి నడవడికతో సమాజానికి ఒక రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.
క్రీడా శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఐదో ఏట నుండే పాటలు పాడటం మొదలు పెట్టిన గానకోకిల లతా మంగేష్కర్ మరణం దేశానికి తీరన లోటు అని అన్నారు. నేటి సమాజంలో ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ ఆమె మధుర గానం ఎంతో హాయిని కలుగజేస్తుందన్నారు.
యూత్ అడ్వాన్సుమెంట్, టూరిజం అండ్ కల్చర్ శాఖలకు సంబంచిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని భారతరత్న లతా మంగేష్కర్కు ఘనంగా నివాళులు అర్పించారు.
Tags AMARAVARTHI
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …