Breaking News

ప్రజాస్వామ్య బలోపేతానికి జాతీయ ఓటరు అవగాహన పోటీలు…

-క్విజ్,వీడియో మేకింగ్, పోస్టర్ డిజైన్, సాంగ్ మరియు స్లోగన్ విభాగాల్లో పోటీలు
-ఔత్సాహిక, వృత్తిపరమైన మరియు సంస్థాగత వర్గాలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు
-ప్రథమ, ద్వితీయ, తృతీయ, స్పెషల్ మెన్షన్ విజేతలకు నగదు పురస్కారాలు
-ఎంట్రీలు మార్చి 15 లోపు voter-contest@eci.gov.in కు ఇ-మెయిల్ చేయాలి
-రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో పాల్గొనేలా జిల్లా ఎన్నికల అధికారులు కృషిచేయాలి
-రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యక్తుల ప్రతిభను, సృజనాత్మకతను వెలికితీస్తూ వారి క్రియాశీల ప్రమేయం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జాతీయ ఓటరు అవగాహన పోటీలను భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నదని ఈ పోటీల్లో రాష్ట్రం నుండి అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా జిల్లా ఎన్నికల అధికారులు కృషిచేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో సమావేశం నిర్వహించి జాతీయ ఓటరు అవగాహన పోటీ వివరాలు, విధి విధానాలు, జిల్లా ఎన్నికల అధికారులు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 12 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా భారత ఎన్నికల సంఘం “జాతీయ ఓటరు అవగాహన పోటీని” ప్రారంభించిందని, సృజనాత్మక వ్యక్తీకరణ ద్వారా ప్రతి ఓటు యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించడానికి ‘నా ఓటు నా భవిష్యత్ శక్తి : ఒక ఓటు శక్తి’ (My Vote is my Future – Power of One Vote) అనే థీమ్ తో ఈ పోటీని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. క్రమబద్దమైన ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్యం (SVEEP-Systematic Voters Education and Electoral Participation) అనే కార్యక్రమం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం ఈ జాతీయ ఓటరు అవగాహన పోటీలను నిర్వహిస్తున్నదన్నారు. ఈ పోటీల్లో క్విజ్, వీడియో మేకింగ్, పోస్టర్ డిజైన్, సాంగ్ మరియు స్లోగన్ అనే ఐదు విభాగాలు ఉన్నాయని, ఔత్సాహిక, వృత్తిపరమైన మరియు సంస్థాగత వర్గాలకు చెందిన అన్ని వయస్సుల వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ, స్పెషల్ మెన్షన్ విజేతలుగా ఎంపికైన వారికి నగదు పురస్కారంతో పాటు ఇ-సర్టిఫికెట్ కూడా అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదే విధంగా నగదు పురస్కారాలు రూ.2.00 లక్షలు మొదలు రూ.3 వేల వరకూ వివిధ విభాగాలకు వివిధ మొత్తాల్లో ఉన్నాయన్నారు. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలు https://ecisveep.nic.in/contest/ అనే వెబ్ సైట్ ల్లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఇందుకు సంభందించిన ఎంట్రీలను ఈ ఏడాది మార్చి 15 లోపు voter-contest@eci.gov.in కు ఇ-మెయిల్ చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
భారత ఎన్నికల సంఘం నిర్వహించే ఈ జాతీయ ఓటరు అవగాహన పోటీ పై విస్తృత ప్రచారం కల్పించి జిల్లాల్లోని అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు ప్రత్యేకించి పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, వీడియో మేకర్సు, పోస్టర్ డిజైనర్స్, సింగర్స్ తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, సాంస్కృతిక సంస్థలకు చెందిన వ్యక్తులు ఈ పోటీల్లో పాల్గొనేలా తగు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణ మరియు ఇ.వి.ఎం. నిర్వహణ వ్యవస్థలకు సంబందించిన పలు కార్యక్రమాల ప్రగతిని సమీక్షిస్తూ పెండింగ్ లోనున్న పనులను సత్వరమే పూర్తిచేయాలని ఆదేశించారు.
ఈ వీడియో సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు సచివాలయం ఎన్నిక విభాగానిక చెందిన డిప్యుటీ సెక్రటరీ ఎ.వెంకటేశ్వరరావు, ఐ.టి. మేనేజర్ మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *