విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓంకార స్వరూపుడైన శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు మహా శివరాత్రి అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. మహాశివరాత్రి శుభ సందర్భంగా సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. తొలుత గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సృష్టి లయకారుడిగా శివుడిని భక్తి ప్రపత్తులతో కొలుస్తారని మల్లాది విష్ణు తెలిపారు. శివరాత్రి పర్వదినాన్ని భక్తి, శ్రద్దలతో జరుపుకుంటున్న ప్రజలందరికీ ఆ ముక్కంటి అనుగ్రహం లభించాలని ప్రార్థించారు. పరమశివుని కృపాకటాక్షాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తలపెట్టిన కార్యక్రమాలన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని కోరుకున్నారు. భక్తులు చేసే ఉపవాస దీక్షతో వారివారి మనోవాంఛ నెరవేరాలని ఆకాంక్షించారు. తదనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు పలికి పరమశివుని తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి, ఆలయ చైర్మన్ కొల్లూరు రామకృష్ణ, ఈవో యడ్లపల్లి సీతారామయ్య, కోలవెన్ను రమణ, యల్లాప్రగఢ సుధీర్ బాబు, మైలవరపు రాము, పరసా శ్రీనివాస్, జయకర్, భక్తులు పాల్గొన్నారు.