విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలోని శివాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గవర్నర్ పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం భక్తజన సంద్రమైంది. తెల్లవారు జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివయ్యను దర్శించున్నారు. తేజో లింగానికి మహారుద్ర, చతుర్వేద మంత్రోచ్ఛారణల మధ్య పాలు, పవిత్ర జలాలతో అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బిల్వ పత్రాలను శివలింగానికి సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని విఘ్నాధిపతికి ఆది పూజ నిర్వహించారు. మహా శివరాత్రి ఉపవాస పూజలను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్న భక్తులకు శివుని కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కాంక్షించారు. అనంతరం భక్తులకు స్వామి వారి ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, డివిజన్ కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీ, నాడార్స్ శ్రీను, రామ్ పిఎస్ఆర్, నిఖిల్ సూద్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …