ద్వారకా తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
చిన వెంకన్న ను కాలి నడక వొచ్చి దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం నాలుగు షెల్టర్ల ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు.
శనివారం ద్వారకా తిరుమల కి వెళ్లే మార్గంలో షేడ్ ల ఏర్పాటు కోసం గుర్తించిన నాలుగు ప్రదేశాలను స్థానిక శాసన సభ్యులు తలారి వెంకట్రావు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ, ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు కలియుగ దైవం, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటు ఉంటారన్నారు. ద్వారకా తిరుమల కి రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలోని పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కిలో మీటర్ల మేర నడచు కుంటూ భక్తులు రావడం జరుగుతుందన్నారు. నడుచుకుంటూ వొచ్చే భక్తులు సేదతీరడానికి, కాల కృత్యాలు కోసం నాలుగు షెల్టర్ల ఏర్పాటు చేస్తామని తెలిపారు. మధురాన్నం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వీటి నిర్మాణం చేపడుతున్న ట్లు పేర్కొన్నారు. ఈ షెల్టర్ల లలో సేద తిరడానికి హాల్, లైటింగ్, ఫ్యాన్, త్రాగునీరు, స్నానాధి కార్యక్రమానికి అనువుగా బాత్రూమ్ లు, తదితర సౌకర్యాలు కల్పించడం తో పాటు ప్రతి శని, ఆదివారాల్లో అల్పాహారం, భోజన సదుపాయాలు భక్తులకు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గం , ద్వారకాతిరుమల దగ్గర దూబచర్ల లో స్థానిక శాసన సభ్యులతో కలిసి ద్వారకా తిరుమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం కోసం షెడ్ల నిర్మాణం కోసం పరిశీలన చేసి వాటికి అనుసంధానంగా రాష్ట్ర ఆర్ అండ్ బి రహదారుల ఏర్పాటు పై సూచనలు చేశారు.
రాళ్ళకుండ వద్ద ఎక్కువ మంది కి వసతి సౌకర్యాలు, దూబచెర్ల నుంచి ద్వారకా తిరుమల, చేబ్రోలు నుంచి వొచ్చే మార్గంలో తాత్కాలిక విరామ గృహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి బస, శుక్ర, శనివారాల్లో భోజన సదుపాయాలు కల్పిస్తానని హమీ ఇచ్చారు. మార్గ మధ్య లైటింగ్ ఏర్పాటు చేస్తున్న ట్లు శాసన సభ్యులు తలారి వెంకట్రావు పేర్కొన్నారు. రాళ్ళకుంట రహదారికి రూ.3.60 కోట్లు తో, జి. కొత్తపల్లి రహదారి నిర్మాణం కోసం రూ. 4 కోట్లు తో చేపడుతున్న ట్లు తెలిపారు రెండు నెలల్లో ఈ నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మార్గ మధ్యలో కాలి నడక తో వచ్చే భక్తులతో వాళ్ల ప్రయాణ వివరాలు అడిగి తెలుసుకుని రానున్న రోజుల్లో చేపడుతున్న కార్యక్రమాలను వివరించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మంత్రి వెంట శాసనసభ్యులు తలారి వెంకట్రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.