కొవ్వూరు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ కి జాతీయ అవార్డు…


రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళా దినోత్సవం పురస్కరించుకుని కొవ్వూరు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేయుచున్న ప్రో. డా. జోన్నకూటి సునీత కి మహిళా జాతీయ పురస్కారం లభించింది. వీరు గతంలో మహిళా వసతి గృహాల అధిపతిగా పని చేసి మహిళలకు విద్యోన్నతి, వసతి, ఉపాది అవకాశాలు కల్పించుటలో అపారమైన సేవలు అందించినందుకుగాను ఫిలాంత్రోపిక్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ వారిచే శుక్రవారం (04.03.2022) రాజమహేంద్రవరం లో రాష్ట్ర, స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి డా. తానేటి వనిత  చేతులు మీదుగా బహుమతి ప్రధానం చేసారు.  ఈ కార్యక్రమంలో ప్రో. డా. జోన్నకూటి సునీత కి, అధికారులు, కాలేజి బోధన మరియు బోధనేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు. డా. సునీతా మాట్లాడుతూ తన విజయంలో తోడుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, తోటి ఉద్యోగులకు, ఉన్నత అధికారులకు తన వద్ద పని చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమములో మార్గాని భరత్ రామ్, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు, చైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి,  ఫిలాంత్రోపిక్ సొసైటీ అధ్యక్షుడు డా.అద్దంకి రాజా,  డ్రీమ్ స్వచ్చంద సేవాసంస్థ చైర్మన్, ఎమ్ఆర్ పియస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేదర సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *