Breaking News

ఉగాది నుండి కొత్త జిల్లా కార్యాలయాలలో పాలన ప్రారంభించాలి…

-కొత్తగా పెట్టిన కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేస్తారు
-అధికార్లకు జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత ఆదేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉగాది నుండి కొత్త జిల్లాల కార్యాలయాల నుండి పాలన ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, ఇందుకు సంబంధించి ప్రాధమిక ఏర్పాట్లు ఈ నెల 18వ తేదీ లోగా పూర్తి చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాలో ఏర్పాటుచేయనున్న కార్యాలయాలు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై స్థానిక రైతు శిక్షణ కేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో అధికారులతో జేసీ సమీక్షించారు. కొత్తగా ఏర్పాటు చేసే కార్యాలయాలలో అవసరమైన కుర్చీలు, టేబుల్స్, అల్మరాలు, వంటి సామగ్రి కార్యాలయాలకు అవసరమైన మరమ్మత్తులు, వసతి సదుపాయాలు వంటి అంశాలపై అధికారుల నుండి సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాధవీలత మాట్లాడుతూ విజయవాడ జిల్లా కేంద్రంగా కొత్తగా ఏర్పాటుచేయనున్న ఎన్ .టి.ఆర్. జిల్లాలో ఉగాది నుండి కొత్త కార్యాలయాలు పనిచేసే విధంగా అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త జిల్లా అయిన ఎన్టీఆర్ పేరుతో కార్యాలయాల బోర్డులు, అధికారుల హోదాలతో కూడిన బోర్డులు సిద్ధం చేయాలన్నారు. శాఖల కార్యాలయాల బోర్డులకు తెలుపు రంగు బోర్డులపై నీలం అక్షరాలు, ప్రభుత్వ లోగోతో పెద్దసైజ్ లో బోర్డులు ఉండాలన్నారు. అంతేకాక కొత్తగా ఏర్పాటుచేసిన కార్యాలయాలకు సంబంధించి చిన్న, చిన్న మరమ్మత్తులు, విద్యుత్, టాయిలెట్స్, తదితర మరమ్మత్తులు పూర్తి చేయించాలన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ఎన్ . టి. ఆర్. జిల్లా కార్యాలయాలకు ప్రతిపాదించిన ఫర్నీచర్లను ఈ నెల 18వ తేదీ లోగా తరలించాలన్నారు. ఈ నెల 18వ తేదీ నుండి జిల్లా కలెక్టర్ జె.నివాస్, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు కొత్తగా ఏర్పాటుచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తారన్నారు. కొత్త జిల్లాలో కార్యాలయాలు ఏర్పాట్లు, ఫర్నీచర్ తదితర అంశాలపై ఎక్కడా ఎటువంటి సమస్యలు లేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా) కె. మోహన్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *