-ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
-ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా ముక్కాల ద్వారకనాధ్
-విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా కొండపల్లి బుజ్జి
-ఆర్యవైశ్య ప్రజా ప్రతినిధులను సన్మానించిన ఆర్యవైశ్య మహాసభ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అర్బన్ జిల్లా ఆర్య వైశ్య సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అంగరంగవైభోగంగా ని ర్వహించారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ సర్వసభ్య సమావేశం ఆదివారం నాడు జరిగింది. ఈ సమావేశంలో రెండో సారి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గా ముక్కాల ద్వారకనాధ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులకు వివిధ దేవాలయాల్లో దర్మకర్తలు గా ఉన్నటువంటి ఆర్యవైస్యులకు చిరు సత్కారాని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా రాష్ట్ర దేవదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కొలగట్ల వీరభద్రస్వామి, అన్నా రాంబాబు, మద్దాలి గిరిధర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్యవైస్యుల అభివృద్ధికి ద్వారకా కృషి చేయాలనీ దానికి నా పూర్తి సహకారం ఉంటుందన్నారు. మరియు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కి సన్నిహితుడైన కొండపల్లి బుజ్జి విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందన్నారు విజయవాడ నగరం లో ఆర్యవైస్యుల అభివృద్ధికి బుజ్జి పాటుపడాలన్నారు. టీడీపీలో ఆర్యవైస్యులకు సరైన గౌరవం లేదన్నారు జగన్ మోహన్ రెడ్డి ఆర్యవైస్యులకు పెద్ద పీట వేస్తూ ఆర్యవైస్యుల సమస్య ఏ సమస్య ఆయిన దృష్టికి వెళ్లిన ఆ సమస్య త్వరితగతిన పరిష్కరిస్తున్నారు అన్ని తెలిపారు. రోశయ్య ని అవమానించిన వ్యక్తి చంద్రబాబు అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం రోశయ్య మరణిస్తే ముగ్గురు మంత్రులను అక్కడకు పంపించి సంతాపదినాలను ప్రకటించారని తెలిపారు. నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించేందుకు జి.ఓను విడుదల చేసిన మహోన్నతమైన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి ని కొనియాడారు. వైస్యుల పట్ల జగన్ మోహన్ రెడ్డి కి అమ్మితమైన ప్రేమ ఉందని తెలిపారు. పెనుగొండకి వాసవి పెనుగొండగా నామకరణం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు, ఆర్యవైశ్య నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు, రేపాల శ్రీనివాసరావు, గుబ్బ చంద్రశేఖర్, సాదు ప్రతాప్ , ఘాకోళ్లపు శివరాసుబ్రహ్మణ్యం, కుప్పం ప్రసాద్ తదితర ఆర్యవైశ్య సంఘం నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.