నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని సబ్ కలెక్టర్ కార్యాలయం డీవిజినల్ పరిపాలనాధికారి ఎం. హరనాథ్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ . ఓ. హరనాథ్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరనాథ్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జీవితం పోరాటపటిమ, త్యాగనిరతికి నిదర్శనమన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని హరనాథ్ చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన అందించిన స్పూర్తితో నేటి యువత దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. కార్యక్రమంలో సహాయ పౌరసరఫరాల అధికారి పార్వతి, సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది జీ.వి. ,గోపి, కార్తీక్, శివరాం, రంగారావు, ప్రభృతులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …