Breaking News

వాలంటీర్లకు ఎన్ని సన్మానాలు చేసినా వారి రుణం తీర్చుకోలేము… : ఎమ్మెల్యే పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఎంతో సమర్దవంతంగా పనిచేస్తుందని , సేవా దృక్పధంతో వాలంటీర్లు పనిచేస్తున్నారని, వాలంటీర్లకు ఎన్ని సన్మానాలు చేసినా వారి రుణం తీర్చుకోలేనిదని మాజీ మంత్రి మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రశంసించారు.
స్థానిక పోర్టు రోడ్డులోని మెహరబాబా ఆడిటోరియంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వరుసుగా రెండో ఏడాది వాలంటీర్లకు వందనల 50 డివిజన్లకు సంబంధించి కార్యక్రమాన్ని బుధవారం పలువురు కార్పొరేటర్లు సమక్షంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి శాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరవేస్తోందన్నారు. ఎటువంటి వివక్ష, అవినీతిలకు తావులేకుండా, కుల మత రాజకీయాలను పట్టించుకోకుండా ఒక సానుకూల వాతావరణంలో కొనసాగడం హర్షణీయమన్నారు. వలంటీర్‌ వ్యవస్థ దేశంలోనే గొప్ప ఒక బలమైన సమూహంగా రూపుదిద్దుకుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. జీతభత్యాలు, లాభాన్ని పట్టించుకోకుండా.. సేవే పరమావధిగా వలంటీర్లు ముందుకు సాగుతున్నారంటూ కొనియాడారు. ఎంత వస్తుందని లెక్క వేసుకోకుండా, ఎంత సేవ చేస్తున్నామనే వాలంటీర్లు చూస్తున్నారన్నారు. సచివాలయం వంటి గొప్ప వ్యవస్థ రాష్ట్రంలో నడుస్తోందని అన్నారు. అవినీతి రహితంగా , కులమతాలకు అతీతంగా ఎటువంటి వివక్షకు తావులేకుండా వాలంటీర్ల వ్యవస్ధ నడుస్తుందన్నారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు సత్వరం, మెరుగైన సేవలు అందించేలా వాలంటీర్లు రేయంబగళ్లు పనిచేస్తున్నారని కొనియాడారు. మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు. ప్రజలకు- ప్రభుత్వానికి మధ్య వాలంటీర్ ఒక వారధిలా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజల వద్దకు పరిపాలనను చేరవేయడంలో వాలంటీర్ చేసే కృషి మరువలేనిదని, కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వాలంటీర్ సేవలందించార ని, ఒక విప్లవాత్మకమైన మార్పులు చేస్తూ వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ ప్రవేశపెట్టడం జరిగిందని, దేశం మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిందని, లంచాలకు అవకాశం లేకుండా వాలంటీర్లు ప్రజలకు విశేష సేవలందిస్తున్నారని ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు.
నగరపాలక సంస్థ పరిధిలో 12 రకాల పింఛన్లు ప్రతి నెలా ఒకటో తేదీ ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నారన్నారు. వైఎస్‌ఆర్‌ బీమా, ఆసరా, చేయూత, జగనన్న తోడు, చేదోడు, రైతు భరోసా, సేవలు అందించడంలో వాలంటీర్లదే కీలకంగా ఉందన్నారు. ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు సేవామిత్ర,సేవా రత్న, సేవా వజ్ర పురష్కారాలు అందించడం వారిని గౌరవించడం తమ కర్తవ్యమన్నారు. మచిలీపట్నంలో 800 మంది వార్డు వాలంటీర్లు ఉండగా , 1 వా డివిజన్ ఈడేపల్లికి చెందిన కోడూరు సుధా రాణి , జబీనా భాను ఈ ఇరువురు సేవ వజ్రకు ఎంపికయ్యారు. వీరికి చెరోక రూ.30 వేలు నగదు పురస్కారం అందచేసి సర్టిఫికెట్, బ్యాడ్జి , శాలువా, బంగారు పతకం అందచేశారు. అలాగే సేవరత్నకు ఎంపిక కాబడిన సుంకర రామరాజు, కె. ఉదయలక్ష్మి, తాత నాగ వెంకట స్వరూప, మురాల దుర్గ, డోకుపర్తి శివలీల, కొలుసు దుర్గామాధవి, మునగాల రూప రాణి , ఆకూరి చందు ప్రియ, ఆలీ అబ్బాస్, అబ్దుల్ రహంతుల్లా తో కలిపి 10 మంది ఎంపికయ్యారు వీరందరికి సేవరత్న పురస్కారం ఒక్కొక్కరికి రూ.10 వేలు అందచేశారు, అనంతరం పలువురు వాలంటీర్లకు సత్కారాలు చేశారు.
వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత, మచిలీపట్నం మాజీ మునిసిపల్ ఛైర్మెన్, పట్టణ వైస్సార్ సీపీ అధ్యక్షులు షేక్ సలార్ దాదా, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమీషనర్ చంద్రయ్య , కార్పొరేటర్లు జోగి చిరంజీవి, పరింకాయల విజయ్ చందర్, ముంతాజ్ బేగం, మేకల సుబ్బన్న , రామిశెట్టి శ్రీవాణి, మహమ్మద్ రఫీ, కాగిత జవహర్ ( బున్నీ) కృష్ణాజిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గూడవల్లి నాగరాజు, బందెల థామస్ నోబుల్ , గాజుల భగవాన్, శీలం బాబ్జి, షేక్ సాహెబ్, తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *