-వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో భాగంగా గురువారం తూర్పు నియోజకవర్గ పరిధిలో 14వ డివిజన్ దర్శిపేట రాజరాజేశ్వరి కళ్యణమండపము నందు జరిగిన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియ ఆయా డివిజన్ కార్పొరేటర్లతో కలసి స్వయం సహాయక సంఘాల వారికీ సున్నా వడ్డీ క్రింద మంజూరు కాబడిన చెక్కులను పంపిణి చేసారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 3375 సంఘాల వారికీ 4 కోట్ల 93లక్షల 6వేల 529 రూపాయల చెక్కును అందించే కార్యక్రమము ఈ వారోత్సవాలలో అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పధకం క్రింద మూడవ విడతగా చెక్కులను అందించుట జరుగుతుందని దానిలో భాగంగా నేడు 9, 12, 13 మరియు 14వ డివిజన్లకు సంబందించి 625 స్వయం సహాయక సంఘాలలోని 6250 మంది పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తూ వారిని లక్షాధికారులుగా చేసే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారికీ సంక్షేమ పథకములు – తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, సమాజంలోని అన్ని వర్గాల వారికీ సంక్షేమ పథకములు అందించి సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్ద పీట వేసిన ఘనత వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. నియోజకవర్గoలో అర్హులైన వారందరికి సంక్షేమ పథకములను అందించేలా చూస్తానని అన్నారు. అనంతరం కార్పొరేటర్లు మరియు స్వయం సహాయక సంఘాల మహిళలతో కలసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమములో కార్పొరేటర్లు చింతల సాంబశివరావు, తంగిరాల రామిరెడ్డి, యు.సి.డి సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు మరియు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.