Breaking News

ఈ నెల 29 న బందరు పోర్టుకు సంబంధించి పబ్లిక్ హియరింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయాలి… : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బందరు పోర్టుకు సంబంధించి పబ్లిక్ హియరింగ్ ఈ నెల 29 వ తేదీ ఉదయం 11 గంటలకి జడ్పి సమావేశపు మందిరంలో జరగనుందని అందుకు తగిన ఏర్పాట్లు త్వరితగతిన చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధికారులను ఆదేశించారు. గురువారం బందరు మండలం తపసిపూడి గ్రామ పరిధిలో పోర్టు భూములను జిల్లా కలెక్టర్ ఫిజికల్ వెరిఫికేషన్ చేశారు. భూముల సర్వే త్వరగా పూర్తి చేసి భూసేకరణ నియమ నిబంధనల ప్రకారం అంచనా వ్యయం త్వరగా డిపాజిట్ చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. బందరు పోర్టు అభివద్ధి కోసం వాస్తవంగా ఎంత భూములు అవసరం, ఇప్పటి వరకు సేకరించిన భూముల విస్తీర్ణం, వాటికి చెల్లింపులు, ఇంకా సేకరించాల్సిన భూముల వివరాలు , వాటికి అయ్యే ఖర్చు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. మొదటి ఫేజ్ లో 1730 ఎకరాలలో చేపట్టనున్న పోర్టు పనులు, రోడ్డు , రైల్ కనెక్టవిటీ కోసం అవసరమైన 200 ఎకరాల భూముల భూసేకరణ పురోగతిపై ఆరా తీశారు. ఈ భూములకు సంబంధించి సర్వే సబ్ డివిజన్ రికార్డ్ వారం రోజుల్లో అప్పగించాలని సర్వే ఏ డి ను కలెక్టర్ ఆదేశించారు. అలాగే కమీషనర్ అఫ్ సర్వే సెటిల్మెంట్ వారు అడిగిన ప సమాచారం పదిరోజులలో పంపాలని సూచించారు. ఆ భూముల ఇప్పటి పరిస్థితులు ఫిజికల్ వెరిఫికేషన్ చేయాల్సివుందన్నారు. అసైన్డ్ భూముల్లో పేదలే ఎక్కువ మంది ఉన్నారనీ, వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన అనుభవదారులను గుర్తించి న్యాయం చేయాలన్నారు. పోర్టుకు సంబంధించి పెండింగ్ పనులన్నీ కొలిక్కి తేవాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ముడా వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, ఏ డి సర్వే గోపాల రాజా, పోర్టు ఆఫీసర్ ధర్మ శాస్త, మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యాశంకర్, మారిటైం బోర్డు డి ఎఫ్ ఓ శ్రీనివాస్, తాసిల్దార్ డి సునీల్ బాబు, రైట్స్ సంస్థ ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *