అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును పలువురి ప్రజాప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు. అందరం కలిపి పనిచేద్దాం అని, ముఖ్యమంత్రి ఆశయ సిద్ధికి కృషి చేద్దాం అని పిలుపు నిచ్చారు. ఆయన్ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, కొఠారు అబ్బయ్య చౌదరి, ఎంఎల్సీ ఇక్బాల్, వైస్సార్సీపీ నార్త్ అమెరికా ప్రతినిధి పండుగాయల రత్నాకర్, సబ్ రీజిస్టర్స్ అసోసియేషన్, ఉద్యోగుల సంఘాల ప్రెసిడెంట్ సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.
Tags amaravathi
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …