Breaking News

ఆక్వా రైతులకు మరో సువర్ణ అవకాశం

-ఎండార్స్మెంట్ కోసం 31.5.2022 వరకు అవకాశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆక్వా రైతు సోదరుల కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వo ఎండార్స్మెంట్ చేసుకొనుటకు మరో అవకాశం కల్పించిందని మత్స్య సహాయ సంచాలకులు, కొవ్వూరు బి. సైదా సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఆక్వా రైతులు, ఆక్వా భూమి కలిగిన రైతులందరి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ వారు తెలియజేయునది ఏమనగా నూతనంగా తీసుకు తీసుకువచ్చిన ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2020 (APSADA) ప్రకారం మీ దగ్గర ఉన్న అన్ని రకాల లైఫ్ టైం పర్మినెంట్ లైసెన్స్ లు కూడా ఈ చట్టం లోనికి మార్చుకోవలసి (రెన్యువల్/ఎండార్స్మెంట్ చేసుకోవాల్సి) ఉంటుందని ఆయన తెలిపారు. కావున రైతులందరూ కూడా మీ దగ్గర ఉన్న పాత లైఫ్ టైం పర్మిషన్ సర్టిఫికెట్స్ అని కూడా ఈ చట్టంలోని ఎటువంటి రుసుము లేకుండా ఎండార్స్మెంట్ చేసుకోవాల్సిందిగా తెలియచేశారు. ఎండార్స్మెంట్ చేసుకొనుటకు చివరి తేదీ మే 31 ( 31.05.2022) వరకు అవకాశం ఉందన్నారు. కావున రైతులందరూ కూడా మీ సమీపంలోని గ్రామ మత్స్య సహాయకులను సంప్రదించ వలసినదిగా పేర్కొన్నారు. గడుపు తేదీలోపు మీ అన్ని రకాల పర్మినెంట్ లైసెన్స్ లు ఎండార్స్మెంట్ చేసుకొని ఎడల ఎకరానికి 1000 రూపాయలు అపరాధ రుసుముతో కొత్తగా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని బి. సైదా తెలిపారు.

ఎండార్స్మెంట్ చేసుకొనుటకు కావలసిన నాలుగు పత్రాలు:
1. పాత లైఫ్ టైం లైసెన్స్ సర్టిఫికెట్
2. చెరువు యొక్క మ్యాప్
3. ఆ చెరువులోని అందరి ఆధార్ కార్డ్స్
4. ఆ చెరువులోని అందరి పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్/లేదా భూమి1 బి అడంగల్

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *