-2022 ఏప్రిల్ నెలలో 122.2 మిలియన్ టన్నుల సరుకు రవాణా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ రైల్వే సరుకు రవాణాలో 2021`22 సంవత్సరం నుండి అత్యుత్తమ పనితీరు ప్రదర్శనను కొనసాగిస్తూ 2022 ఏప్రిల్ నెలలో మునుపెన్నడూ లేనివిధంగా సరికొత్త రికార్డును నమోదు చేసింది. భారతీయ రైల్వే 2021 ఏప్రిల్‌లో 111.64 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగా, 2022 ఏప్రిల్‌లో 10.5 మిలియన్ టన్నుల (9.5% వృద్ధి) పెరుగుదలతో 122.2 మిలియన్ టన్నుల సరుకు లోడిరగ్‌ను సాధించింది.
దీంతో భారతీయ రైల్వే వరుసగా 20 నెలలు ఉత్తమ గణాంకాలను నమోదు చేసినట్టు అయ్యింది. ఈ వృద్ధి 2020 సెప్టెంబర్‌లో ప్రారంభమై నూతన రికార్డులతో నిరాటంకంగా నెలనెలా సరుకు రవాణా అభివృద్ధి చెందుతుంది. భారతీయ రైల్వే ద్వారా ఎన్‌టికెఎమ్‌లు 2021 ఏప్రిల్‌లో 62.6 బిలియన్ కాగా 2022 ఏప్రిల్‌లో 73.7 బిలియన్‌కు పెరిగి 17.7% వృద్ధి సాధించింది.
బొగ్గు లోడిరగ్‌లో 5.8 మిలియన్ టన్నుల పెరుగుదల, ఆహార ధాన్యాల లోడిరగ్‌లో 3.3 మిలియన్ టన్నుల పెరుగుదల మరియు ఎరువుల లోడిరగ్‌లో 1.3 మిలియన్ టన్నుల పెరుగుదల ఈ వృద్ధికి కారకాలు. స్టీల్ ప్లాంట్లు (ఐరన్ ఓర్‌తో సహా) మరియు ఫినిష్డ్ స్టీల్‌కు సంబంధించి ముడిసరుకు మినహా అన్ని వస్తువులు గత సంవత్సరం వృద్ధిని నమోదు చేశాయి. రోజుకు లోడ్ అయిన వ్యాగన్ల సంఖ్య కూడా 9.2% వృద్ధిని నమోదు చేశాయి. భారతీయ రైల్వే గత సంవత్సరం ఏప్రిల్ నెలలో 60434 వ్యాగన్ల లోడిరగ్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో రోజుకు 66024 వ్యాగన్లను లోడ్ చేసింది.
దేశంలో ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ మరియు బొగ్గు దిగుమతిని తగ్గించడంతో (అంతర్జాతీయంగా అధిక బొగ్గు ధరల కారణంగా) దేశీయ బొగ్గుకు గణనీయమైన డిమాండ్ ఏర్పడిరది. ఈ అవసరాలను రైల్వేలు గణనీయంగా తీరుస్తున్నాయి. భారతీయ రైల్వే 2021 సెప్టెంబర్ నుండి 2022 మార్చి వరకు బొగ్గు లోడిరగ్‌ను 32% అధికంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయడమే ఇందుకు నిదర్శనం. ఇదే ప్రక్రియను 2022 ఏప్రిల్‌లో కూడా కొనసాగిస్తూ భారతీయ రైల్వే బొగ్గు లోడిరగ్‌లో (దేశీయ మరియు దిగుమతి రెండిరటిలో) వృద్ధి సాధించింది. ఎన్‌టికెఎమ్‌లలో అధిక వృద్ధి నమోదు చేసింది. ఏప్రిల్ 21లో బొగ్గు లోడిరగ్‌లో 9% వృద్ధి కాగా ఏప్రిల్ 22లో 11% వృద్ధిని నమోదు చేసింది. ఎమ్‌టికెమ్‌లు 20% కంటే ఎక్కువ వృద్ధిని సాధించాయి. విద్యుత్ కేంద్రాలకు దేశీయ బొగ్గు లోడిరగ్ ఏప్రిల్ 22లో 18.8% వృద్ధితో గణనీయంగా పెరిగింది.
ఎఫ్‌సిఐ ఆహార ధాన్యాల సేకరణ మరియు గోధుమ ఎగుమతి డిమాండ్‌తో ఏప్రిల్‌లో ఆహార ధాన్యాల లోడిరగ్ 95% వృద్ధిని నమోదు చేశాయి. అంతేకాక, ఎరువుల లోడిరగ్‌లో 53% వృద్ధి కనిపించింది. కంటైనర్ల రంగంలో 10% వృద్ధి సాధించగా, దేశీయ కంటైనర్ల రంగంలో 25% కంటే అధికంగా వృద్ధి జరిగింది.