అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్.జగన్ శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి అన్నారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని ముఖ్యమంత్రి అన్నారు. క్రమశిక్షణతో ఉండడం, ఐకమత్యంతో మెలగడం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ఆయన పేర్కొన్నారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని ముఖ్యమంత్రి తన సందేశంలో తెలిపారు.
Tags amaravathi
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …