విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముత్యాలంపాడు లో వెలసివున్న శ్రీ షిర్డి సాయిబాబా మందిరములో ఎమ్మెల్సీ, ప్రజా ప్రతినిధి, ముస్లిమ్ మత పెద్ద అయినటువంటి మొహమ్మద్ రుహుల్లా కి మందిరములో గురువారం విశేషముగా పూజా కార్యక్రమాలు నిర్వహించి బాబా వారి ఆశీస్సులు అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా మందిర గౌరవాధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది పి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల తోటి ఉన్నత స్థితికి వచ్చినటువంటి రుహుల్లా రాజకీయంగా ఉన్నత స్థితికి ఎదగాలని ప్రజలకి పనికొచ్చే మంచి మంచి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని ఉజ్వలమైన భవిష్యత్తు రూహుల్లా కి ఉండాలని తెలియజేస్తూ ఈ విశేషమైన స్థానాన్ని పొందినటువంటి రూహుల్లా నాకు చాలా కాలం నుంచి చిన్ననాటి నుండి పరిచయం ఉండడం నాకు ఆనందదాయకం ఇట్లాంటి వ్యక్తికి మన ముఖ్యమంత్రి మంచి పదవి ఇవ్వడం కూడా ఆనందాన్ని కలుగ చేసిందన్నారు. సమాజంలో అన్ని వర్గాలకి కూడా సమమైన స్థానాన్ని కల్పిస్తూ సమాజంలో సమాజంలో అన్ని కులాలకి, అన్ని మతాలకి కూడా చేయవలసిన సేవ రుహుల్లా చేస్తూ ఉండాలని మంచి కార్యక్రమానికి ఎప్పుడూ తోడుండాలని ఉన్నతమైన స్థితి కలగాలని అందుకు కావలసినట్టుగా బాబా వారి ఆశీస్సులు రుహుల్లాకి అందాలన్నారు. ఎమ్మెల్సీ మొహమ్మద్ రుహుల్లా మాట్లాడుతూ ముత్యాలంపాడు షిర్డి సాయిబాబాను దర్శించుకున్నందుకు తనకు ఆనందంగా వుందని అన్నారు. తన మీద నమ్మకంతో ఎమ్మెల్సీ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని చెప్పారు. డిప్యూటీ మేయర్ అవుతూ శైలజా రెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా కి అభినందనలు తెలియజేసి, ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మందిర అధ్యక్ష కార్యదర్శులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …