Breaking News

చంద్రబాబు కూటమి ఒక అతుకుల బొంత

-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్లలో పేద‌ల జీవితాలు ఎంతగానో మెరుగుపడ్డాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 33 వ డివిజన్ 216 సచివాలయం పరిధిలోని వీధులలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి పర్యటించారు. శివరావు వీధి, గిరి వీధి, శివాలయం వీధి, కొమ్మువారి వీధి, వందనపు వారి వీధి, రాజేశ్వరి వీధి, జల్లా వారి వీధి, ఆదిశేషయ్య వీధి, లైబ్రరీ వీధులలో పాదయాత్ర నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వీధిలైట్లు, పింఛన్, రేషన్ పంపిణీ వంటి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజా సమస్యలు నూటికి నూరు శాతం పరిష్కారానికి డివిజన్ పర్యటనలు ఎంతగానో దోహదపడుతున్నాయని మల్లాది విష్ణు అన్నారు. పర్యటనలో భాగంగా నీరు నిలిచిపోతున్న కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. డ్రైనేజీ కూడా ఎక్కడా నిలిచిపోకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ మరియు వీఎంసీ నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు వివరించారు. వీటితో పాటు కొన్ని సమస్యల తక్షణ పరిష్కారానికై ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 2 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందన్నారు. మరోవైపు 216 వ వార్డు సచివాలయం పరిధిలో రూ. 60 లక్షల సంక్షేమాన్ని ప్రజలకు అందించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. 174 మందికి వైఎస్సార్ పింఛన్, 136 మందికి అమ్మఒడి, 27 మందికి జగనన్న విద్యాదీవెన, 78 మందికి ఈబీసీ నేస్తం, 42 మందికి జగనన్న తోడు, 27 మందికి జగనన్న చేదోడు, 11 మందికి వైఎస్సార్ చేయూత, 8మందికి కాపు నేస్తం, ఇద్దరికి వాహనమిత్ర పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు. పథకాలు వర్తించని అర్హులందరికీ జూన్ మాసంలో అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈనెల 11 నుంచి ప్రారంభం కానున్న గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని 96 సచివాలయాల పరిధిలో విస్తృతంగా పర్యటించనున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. అధికారులు కూడా ప్రతి గడపను సందర్శించి ప్రజలతో మాట్లాడాలని సూచించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. జగనన్న ప్రభుత్వం అందిస్తోన్న సుపరిపాలన చూసి రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నాయని మల్లాది విష్ణు అన్నారు. ఆనాడు తెలుగుదేశం, బీజేపీతో కలిసి అధికారం పంచుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ కు కౌలు రైతులు గుర్తుకు రాలేదా..? అని సూటిగా ప్రశ్నించారు. కౌలు రైతు మరణిస్తే రూ. 7 లక్షలు పరిహారం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఒక్కటేనని తెలిపారు. పవన్ యాత్రలన్నీ కేవలం ఉనికిని కాపాడుకునేందుకేనని విమర్శించారు. ఎన్నికలంటే చంద్రబాబుకు ముందుగా గుర్తొచ్చేది పొత్తులని, ఆయన రాజకీయ జీవితమే పొత్తులమయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆయన జతకట్టని రాజకీయ పార్టీ రాష్ట్రంలోనే లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కూటమి ఒక అతుకుల బొంత అని విమర్శించారు. ఒంటరిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ధైర్యం తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేనకు కానీ లేదని మల్లాది విష్ణు అన్నారు. సుపరిపాలనతో ప్రజల్లో నానాటికీ బలపడుతున్న సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే శక్తి రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదని ఉద్ఘాటించారు. ఎవరెన్ని పొత్తులు, ఎత్తులు వేసినా 2024లో వైఎస్సార్ సీపీ మరోసారి అఖండ విజయం సాధిస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. చంద్రబాబు కూటమికి తగిన బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, ఎ.ఎం.ఓ.హెచ్.రామకోటేశ్వరరావు, ఏఈ(ఇంజనీరింగ్) వెంకటేష్, ఏఈ(ఎలక్ట్రికల్) శ్రీనివాస్, డివిజన్ కోఆర్డినేటర్ దోనేపూడి శ్రీనివాస్, నాయకులు శనగవరపు శ్రీనివాస్, మైలవరపు రాము, చల్లాప్రగఢ సుబ్బారావు, చామర్తి మూర్తి, ఓగిరాల రాజశేఖర్, వి.భాగ్యారావు, కొల్లూరు రామకృష్ణ, కూనపులి ఫణి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *