అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం దేవాదాయ శాఖామంత్రి మరియు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సచివాలయంలోని ఆయన చాంబర్లో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మరియు దేవాదాయ శాఖ కమిషనర్ హరిజవహర్లాల్ లతో కలిసి దేవాదాయ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యంగా దేవాలయ భూముల ఆక్రమణలపై ఉక్కు పాదం మోపేలా దేవాదాయ శాఖ నిబంధనలను ఎలా సవరించాలి అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతూ దేవాలయ ఆస్తులకు సంబంధించి ఏ కొద్దిపాటి నష్టాన్ని కూడా సహించే స్థితిలో ప్రభుత్వం లేదన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులైన డిప్యూటీ కలెక్టర్లను దేవాలయాలకు ఈవో లుగా నియమించే అంశంపై చర్చ జరిగింది. దీనికి సంబంధించి అవసరమైన విధి విధానాలు రూపొందించాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. విజిలెన్స్ మరియు సెక్యూరిటీ పటిష్టం దిశగా ఏర్పాట్ల పై చర్చ జరిగింది. సి జి ఎఫ్ నిధులు ఉపయోగించటానికి గల వాస్తవ నిబంధనలు ఏమిటి ఆ నిధులు దారి తప్పకుండా సక్రమంగా వినియోగించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశంపై మంత్రితోపాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ దేవాదాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి సి జి యఫ్ మీటింగ్ వచ్చే సోమవారం అంటే 16వ తేదీన ఉంటుందని దీనికి సంబంధించి కీలకమైన చర్చ జరుపుతామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యాలయానికి సంబంధించి అడిషనల్ కమిషనర్ చంద్ర కుమార్, అడిషనల్ కమిషనర్ 2 చంద్రశేఖర్ ఆజాద్ లీగల్ ఆఫీసర్ సూర్యారావు జాయింట్ సెక్రెటరీ సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …