-”తాను చెప్పినట్లు చేయకపోతే” రోడ్డు పనులు ఆపివేస్తామని బెదిరించినట్లు ఉద్యోగుల ఫిర్యాదు
-చక్రాయపేట పోలీస్ స్టేషన్ కేసు నమోదు
-బెదిరింపులకు ఎవరు పాల్పడినా, అవినీతికి పాల్పడినా 14400, డయల్ 100, లేదా జిల్లా ఎస్.పి ఫోన్ నెంబర్ 9440796900 కు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు
-జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ హెచ్చరిక
కడప, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్.ఆర్.కె కన్ స్ట్రక్షన్స్ సంస్థ ఉద్యోగులను బెదిరించిన కేసులో వై.ఎస్ కొండారెడ్డి అనే వ్యక్తిని చక్రాయపేట పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయం లో ఎస్.పి మీడియా తో మాట్లాడారు. వేంపల్లి – రాయచోటి రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న ఎస్.ఆర్.కె కంస్ట్రక్షన్స్ లో పని చేస్తున్న ఉద్యోగులకు వై.ఎస్. కొండారెడ్డి ఈ నెల 5 న ఫోన్ చేసి తాను చెప్పినట్టు చేయకపోతే రోడ్డు పనులు ఆపివేస్తామని బెదిరించినట్లు 9 న సోమవారం ఉదయం సదరు ఉద్యోగుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం చక్రాయపేట పోలీసులు కడప సమీపంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్.పి తెలిపారు. రిమాండ్ నిమిత్తం లక్కిరెడ్డిపల్లె కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ తెలిపారు. బెదిరింపులకు పాల్పడినా, అవినీతికి పాల్పడినా 14400, డయల్ 100, లేదా జిల్లా ఎస్.పి ఫోన్ నెంబర్ 9440796900 కు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు..జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ హెచ్చరిక. జిల్లాలో ఎవరైనా అధికారులను, లేదా ప్రైవేటు వ్యక్తులను లేదా ప్రజలను తమ స్వలాభానికి లేదా డబ్బుల కోసం బెదిరించడం, అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యక్తులను ఉపేక్షించే ప్రసక్తే లేదని, అలాంటి వ్యక్తుల సమాచారాన్ని 14400 డయల్ 100, లేదా తన ఫోన్ నెంబర్ 9440796900 కు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ హెచ్చరించారు.