Breaking News

కాలుష్య కారక సంస్థలపై పూర్తి పర్యవేక్షణ

-కాలుష్య నియంత్రణ మండలి పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష
-పరిశ్రమలకు అనుమతుల విషయంలో అనవసరపు జాప్యం వద్దు
-పర్యావరణ పరిరక్షణ పద్దతులను ఖచ్చితంగా అమలు చేయాలి
-అధిక కాలుష్యానికి కారణమయ్యే సంస్థలపై కఠిన చర్యలు
-ఖచ్చితంగా పర్యవరణ హిత విధానాలను పాటించాల్సిందే

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కాలుష్యంకు కారణమవుతున్న పరిశ్రమలు, సంస్థలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ద్వారా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, ఇంధన, గనులశాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అదే క్రమంలో పరిశ్రమల ఏర్పాటులో కాలుష్య నియంత్రణ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూనే అనుమతుల జారీ కొనసాగించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ అనుమతుల కోసం ఎన్ని సంస్థలు, పరిశ్రమలు దరఖాస్తు చేసుకున్నాయో సమీక్షించాలని, వాటికి అనుమతులను జారీ చేసే క్రమంలో చేపట్టాల్సిన పర్యావరణ అనుకూల విధానాలపై నిర్ధిష్టమైన సూచనలు చేయాలని అన్నారు. పర్యావరణ అనుమతులు రాకపోవడం వల్లే పారిశ్రామిక ప్రగతి నిలిచిపోతోందనే విమర్శలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆయా పరిశ్రమలు, సంస్థలు విడుదల చేసే కాలుష్యంను బట్టి వాటిని నాలుగు కేటగిరిలుగా విభజించడమైందని అన్నారు. అత్యధిక కాలుష్యంను వెదజల్లే పరిశ్రమల కేటగిరిలో 3599, మధ్యస్థంగా కాలుష్య కారకమయ్యే పరిశ్రమలు 3686, తక్కువ కాలుష్యంకు కారణమయ్యే పరిశ్రమలు 1273, సూక్ష్మస్థాయిలో కాలుష్యంను విడుదల చేసే పరిశ్రమలు 395 ఉన్నట్లు గుర్తించామని అన్నారు. ఈ కేటగిరిల్లోని పరిశ్రమలకు దరఖాస్తు చేసుకున్న తరువాత 7 నుంచి 21 రోజుల్లో అనుమతులను ఇవ్వాలని అన్నారు. గత ఏడాది పలు పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ విధానాలను తనిఖీ చేసేందుకు సెంట్రల్ ఇన్స్ పెక్షన్ సిస్టమ్ ద్వారా 250 సంస్థల్లో తనిఖీలు నిర్వహించి, నమూనాలను సేకరించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని మూడు జోనల్ కార్యాలయాలు, 13 రీజనల్ కార్యాలయాల ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ మండలి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, భవిష్యత్తులో వీటిని రీస్ట్రక్చర్ చేయడం ద్వారా మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఎకె పరీడా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పర్యావరణం) నీరబ్ కుమార్ ప్రసాద్, చీఫ్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, పలువురు జోనల్, రీజనల్ అధికారులు

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *