గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశంలో తొలిసారిగా గుంటూరు, నల్లపాడు రోడ్ సాయినగర్‌లో 23కోట్ల శ్రీవిద్యాబీజాక్షరములు నిక్షిప్తం చేయబడి, 20 అడుగుల ఎత్తులో నిర్మించిన స్థూపంపై 2 అడుగుల శ్రీచక్రం ప్రతిష్ఠించబడిన శ్రీ మహాగణపతి శ్రీ కుమార స్వామి సహిత శ్రీ చౌడేశ్వరీ చంద్రశేఖర సమన్విత శ్రీ చక్రాలయంలో సోమవారం ఉదయం శ్రీచక్ర వేదాద్యయన శిక్షణాతరగతులకు శ్రీకారం చుట్టబడుతున్నది. ప్రధానంగా అర్చకులకు వారానికి 2రోజులు బుధ, శుక్రవారాలలో ఈ తరగతులు నిర్వహించబడతాయి.
కారంచేడులోని శ్రీ వశిష్ట ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ ప్రణవానంద గిరిస్వామి నేతృత్వంలో ఆశ్రమ ఉత్తర పీఠాధిపతి, గుంటూరు శ్రీ చక్రాలయ సర్వాధికార ప్రతినిధి శ్రీశ్రీశ్రీ విశ్వంభరానంద గిరి స్వామి ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.
ఈ ప్రారంభ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ ప్రెస్‌లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, తర్కశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ ప్రాచార్య శ్రిష్ఠిలక్ష్మీ కుమార్ శర్మ, బోధకులు రిటైర్డ్ ప్రిన్సిపల్ బ్రహ్మశ్రీ అవ్వారు వెంకటేశ్వర్లు పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విశ్వంభరానంద గిరి స్వామి మాట్లాడుతూ ‘‘నేటికలియుగంలో కలి ప్రధాన దోష ధూషితులైనవారందరూ తరించే గొప్ప శక్తి శ్రీచక్ర నవారణ పూజలలో దాగి ఉందన్నారు. అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా సర్వశుభాలు పొందే అదృష్టం ఈ మందిరంలో జరుగుతున్న శ్రీచక్ర నవావరణ పూజలలోనే ఉందన్నారు. వివిధ దేవాలయాలలో పనిచేసే అర్చకులు, జిజ్ఞాస కలవారు తప్పక ఈ తరగతులకు హాజరై నేర్చుకోవచ్చన్నారు. అలాగే, వివిధ దేవతా పూజలు కూడా ఇక్కడ బోధించబడతాయని తెలిపారు.
Tags guntur
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …