కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఘన స్వాగతం పలుకుతున్నారని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రంకొవ్వూరు మండలం కాపవరం గ్రామం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, గడపగడపకు వెళుతున్న మాకు ప్రభుత్వం వారికి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరాలు తెలియజేస్తూ న్నారన్నారు. మమ్మల్ని ఆశ్చర్య పరిచేలా వాళ్లమాటలు ఉన్నాయన్నారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించడం పట్ల ప్రజలు జగనన్న పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారన్నారు. మా కోసం మా కంటే గొప్పగా ఇంతగా ఆలోచించే ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని అనడం చూశామన్నారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అనే మాటలు నిజం చేస్తూ హామీలు అమలు చేయడం జరుగుతుందన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం ఎవరి వద్దకు వెళ్లలేదని, అర్హులను గుర్తించే క్రమంలో వాలంటీర్లు ఇంటికి వచ్చి పథకాలను వర్తింపజేస్తున్నారు అని పేర్కొన్నారు ప్రభుత్వానికి జగనన్నకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చే తరాలకు ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారన్నారు. మునిసిపల్ ఛైర్ పర్సన్, బావన రత్న కుమారి, జడ్పీ వైస్ చైర్మన్ పి. శ్రీలేఖ, జెడ్పీటీసీ బొంత వెంకటలక్ష్మీ, డి డి ఓ/ డ్వామా ఇంఛార్జి పిడి పి జగదాంబ, తహశీల్దార్ బి. నాగరాజు నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు సుంకర సత్యనారాయణ, కాపవరం సర్పంచ్, సుంకర పద్మిని, తది తరులు పాల్గొన్నారు.
Tags kovvuru
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …