విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును అందరూ వినియోగించుకునేలా ఎన్నికల వ్యవస్ధలు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశానికి పటిష్టమైన ఎన్నికల వ్యవస్ధను కల్పించిందని, దానిని అమలు చేయవలసిన బాధ్యత అయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులపైనే ఉందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు ఎన్నికల సంఘం చక్కదిద్దవలసిన వ్యవహారాలపై దృష్టి సారించాలని, దానిలో ఓటర్ల అవగాహన కార్యక్రమాలు కీలకమైనవని బిశ్వభూషణ్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరుకు సంబంధించిన వివరాలను మీనా గవర్నర్ కు వివరించారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …