Breaking News

ఆదర్శ మానవతామూర్తులు గోగినేని దంపతులు… 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గోగినేని దంపతులు గుంటూరుజిల్లాలోను, స్వగ్రామం నడింపల్లి చుట్టుప్రక్కల ప్రాంతాలలో తెలియని వారు వుండరనటంలో సందేహంలేదు. రైతు కుటుంబంలో జన్మించి ప్రజా సేవే లక్ష్యంగా, విద్యా, ఆధ్యాత్మిక సేవారంగాలలో గుర్తింపు తెచ్చుకుని అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నమానవతా మూర్తి కీ॥శే॥ గోగినేని నాగేశ్వరరావు. రాష్ట్రంలో కీ॥శే॥ గోగినేని నాగేశ్వరరావు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఎన్నోపురస్కారాలు, అవార్డులు పొంది, మరెన్నో గౌరవ స్థానాలు కూడా స్వీకరించారు. రాష్ట్ర స్థాయిలో స్వగ్రామం నడింపల్లికి గుర్తింపు తెచ్చి అన్ని విధాలా అభివృద్ధికి కృషి చేసారు. స్వగ్రామం నడింపల్లి గ్రామాభివృద్ధి కాకుండా చుట్టు ప్రక్కల గ్రామాలాభివృద్ధికి పాటు పడ్డారు. గ్రామ స్థాయిలో అందరు పిల్లలు చదువుకోవాలని వారికోసం ఎంతో కృషి చేశారు.రైతు అన్నివిధాలా నూతన విధానాలు ద్వారా ఎలా వ్యవసాయం చేసు కొని తన కష్టంకి తగ్గ ప్రతిఫలం పొందాలో ఎప్పటికప్పుడు తెలుసుకొని వారికి చెప్పే రైతు బిడ్డ. విద్యార్థులు పుస్తకపఠనం ద్వారా విజ్ఞానం పెంచుకో వచ్చనే నిత్యం చెప్పే పుస్తక భాండాగారం అయన. గ్రామంలో ఉన్నత మునసుబు పదవిలో వుండి కూడా ఎప్పుడూ అధికార దర్పం చూపని ఆదర్శమూర్తి. ఎప్పటి నుండే యోగ విలువ తెలిసిన యోగీశ్వరుడు. తనకు తెలిసిన విద్యను అందరికి నేర్పి, తన దగ్గరవున్న దానితో చేతనైనంతలో సాయం చేసిన దాత. ఆయన వెన్నంటివుండి చివరివరకు చేదోడువాదోడుగా వున్న ఆయన సతీమణి కీ॥శే॥ హేమలతా దేవి అందరికి ఆదర్శ మహిళ. ఎన్నివున్నాకూడా గర్వం అనేది లేకుండా అందరితో కలిసి మెలిసి వుండే ఆదర్శ మానవతామూర్తులు వీరు.

అయన ఎందరికో చేసిన సాయాలు తెలిసిన వాటికన్నా తెలియనివి ఎన్నో వున్నాయని, అయన చేత సాయం పొందిన ఎందరో ఇక్కడా, విదేశాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారని,  వారు లేని లోటు తమ గ్రామానికే కాదు చుట్టుప్రక్కల గ్రామాలకు తీరని లోటని, ఎవరికి కష్టం వచ్చినా ఏ సమయంలోనైనా పిలవగానే పలికి నిత్యం అందుబాటులో వుండి ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే దేవుడులాంటి మనిషులని, అలాగే భర్త కీ॥శే॥ గోగినేని నాగేశ్వరరావు.అడుగుజాడలలో నడిచి మహిళా లోకానికే వన్నె తెచ్చిన ఎందరికో నేనున్నాను అని భరోసా ఇచ్చి అన్నివిధాలా సాయమందించి ఆదుకున్న మహిళామని కీ॥శే॥ హేమలతా దేవి అని కొనియాడుతూ, వారి తరువాత కూడా వారి పిల్లలు విదేశాల్లో వున్నాకూడా ఇప్పటికీ  వారు చూపిన బాటలో నడుస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని, దేనికి ప్రతిఫలం ఆశించని మహామనిషులు, ఎంతవున్నా సింపుల్‌ సిటీని ఎక్కువగా ఇష్టపడి, సాంప్రదాయ విలువలకి, సాంప్రదాయ దుస్తులకు వన్నె తెచ్చిన గాంధేయ వాదులు… ఆదర్శనీయులు మన కీ॥శే॥ గోగినేని నాగేశ్వరరావు, కీ॥శే॥ హేమలతా దేవి వారు భౌతికంగా దూర మైనా అయన చేసిన మంచి పనులు కలకాలం గుర్తుంటాయని, ఈ దంపతులను చుట్టుప్రక్కల గ్రామాలవాళ్ళు ఆదిదంపతులు అని అనడానికి కారణం ఈ దంపతులు దేనికి ప్రతిఫలం ఆశించకుండా ఎందరికో చేసిన సాయాలు తెలిసిన వాటికన్నా తెలియనివి ఎన్నో వుండటంతో పాటు సేవాతత్పరత, మంచితనమే కారణం అనటంలో సందేహమే లేదని ఆయనతోపాటు చివరి దాకా ప్రయాణించిన నిజాంపట్నం ధర్మారావు జ్ఞప్తికి తెచ్చుకుంటూ వారికి ఘన నివాళి తెలిపారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *