-నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ చే వివిధ ప్రదేశాలలో మరియు కాలనీ లలో ఆధునీకరించిన పార్క్ ల నిర్వహణ కు సంబందించి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వేటనరీ కాలనీ పార్కు నందు నగర పరిధిలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్ జాస్తి సాంబ శివ రావు మరియు పలు కాలనీ ల ప్రెసిడెంట్ / సెక్రటరీలు పాల్గొన్నారు.
సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులతో నగర మేయర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా అనేక పార్క్ లను స్థానికంగా ఉన్న ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల ఆట పరికరాల ఏర్పాటు చేయుటతో పాటుగా ఆకర్షనీయమైన మొక్కలతో ఆహ్లాదకరంగా అభివృద్ధి పరచినట్లు వివరించారు. స్థానికంగా ఉన్న కాలనీ వాసులు లేదా అసోసియేషన్ వారు ముందుకు వచ్చి ఆయా పార్క్ ల నిర్వహణ భాద్యతలను తీసుకున్నట్లయితే ఎల్లవేళల పార్కు ప్రజలకు అందుబాటులో ఉంటాయని అన్నారు. పార్క్ ల నిర్వహణకు అవసరమైన సిబ్బందికి అగు ఖర్చు నగరపాలక సంస్థ నుండి 60 శాతం చెల్లించుట జరుగుతుందని, మిగిలిన 40 శాతం పార్క్ అసోసియేషన్ వారు చెల్లించాలని వివరించారు. సమావేశంలో కాలనీ వాసులు వారికి ఎదురైన సమస్యలు మరియు వారి సలహాలను మేయర్ గారికి వివరించగా వాటికీ సమాదానం తెలియజేస్తూ, నగర అభివృద్ధి దృష్ట్యా కాలనీ వాసులు నగరపాలక సంస్థ తో కలసి పని చేసి నగరాన్ని సుందరంగా ఆకర్షనియంగా తీర్చిదిద్దుటలో సహకారాన్ని అందించాలని సూచించారు. సదరు సమావేశనికి అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ హార్టికల్చర్ శ్రీనివాసులు, మరియు కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.