అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 26 (నేటి) నుండి నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయ భేరిని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం రాజ్యసభ స్థానాలకు నామినేషన్ వేసిన ఇద్దరు బి.సి. అభ్యర్థులు, ఇతర మంత్రులతో కలసి ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రాంగణంలో పాత్రికేయులతో మాట్లాడుతూ సామాజిక న్యాయ భేరి కార్యాచరణ ప్రణాళిక మరియు ఆ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆద్వరంలో నడుస్తున్న తమ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ,బి.సి., మైనారిటీ వర్గాలకు అన్ని పధవుల్లో సముచితమైన స్థానాన్ని కల్పించడం జరిగిందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల పదవుల్లో ఎస్సీ,ఎస్టీ,బి.సి., మైనారిటీ వర్గాలకు 50శాతం పైబడి పదవులను కట్టబెట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర కేబినెట్ లో 25 మంది మంత్రులు ఉంటే వారిలో 17 మంత్రి పదవులు ఎస్సీ,ఎస్టీ,బి.సి., మైనారిటీ వర్గాలకు చెందిన వారికే ఇవ్వడం జరిగిందన్నారు. కేబినెట్ లోనే కాకుండా కార్పొరేషన్లు, మార్కెటింగ్ కమిటీలు, ఎండోమెంట్ బోర్డుల్లో కూడా చైర్మన్లు, డైరెక్టర్లు పధవులను కూడా 50శాతం పైబడి ఈ వర్గాలకు కట్టబెట్టడం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా స్వాతంత్ర్యం వచ్చిన తదుపరి ఎస్సీ,ఎస్టీ,బి.సి., మైనారిటీ వర్గాలకు 50 శాతం పైబడి పధవులను కట్టబెట్టినది తమ ప్రభుత్వమేనన్న విషయాన్ని గర్వంగా ప్రజలకు తెలియజెప్పడానికే ఈ సామాజిక న్యాయ భేరిని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సామాజికంగా అణగారిపోయిన ఈ వర్గాలు అన్నింటికి అన్నిరకాల పధవుల్లో సముచితమైన స్థానాన్ని కల్పించడం వల్ల ఆయా వర్గాలకు చెందిన ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ది చెందడానికి తమ ప్రభుత్వం మార్గం సుగమం చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సామాజిక న్యాయ భేరి కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజెప్పడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం శ్రీకాకుళంలో ప్రారంభం అయి అనంతపురంలో ముగుస్తుందన్నారు. ఈ నెల 26 న విజయనగరంలో, 27 న రాజమండ్రిలో, 28 న నర్సరావుపేట మరియు 29 న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ బహిరంగ సభల్లో రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు అంతా పాల్గొంటారని ఆయన తెలిపారు.
ఈ సామాజిక న్యాయ భేరి కార్యక్రమంలో ప్రదర్శించేందుకు వీలుగా రూపొందించిన ఆడియో,విజ్యుయల్ చిత్రాన్ని ఈ సందర్బంగా మంత్రులు విడుదల చేశారు.
అనంతరం రాజ్యసభ సభ్యుల ఎన్నికకు అభ్యర్థులుగా నామినేషన్లను దాఖలు చేసిన వి.విజయ సాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఎస్.నిరంజన్ రెడ్డి మరియు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ తమను రాజ్య సభ సభ్యులుగా తమను ఎంపికచేసినందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి వాటి పరిష్కారానికి శక్తివంచలేకుండా కృషిచేస్తామని అన్నారు.
ఉప ముఖ్యమంత్రులు కె.నారాయణ స్వామి, అంజాద్ భాషా షేక్ బిపారి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జోగి రమేష్, మేరుగు నాగార్జున, కారుమూరి వెంకట నాగేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …