Breaking News

శాప్ ద్వారా సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక ఆటల పోటీలు

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె.రోజా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను ప్రధానం చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె. రోజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో జరిగిన వార్షిక క్రీడా పోటీల్లోని విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం బుధవారం సచివాలయం ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేస్తూ అభినందించారు. ఈ సందర్బంగా మంత్రి ఆర్.కె.రోజా మాట్లాడుతూ రాష్ట్రాభివృద్దికి, ప్రజల సంక్షేమానికి అవసరమైన పలు విధి, విధానాలను రూపొందించే ఫైళ్లతో నిత్యం కుస్తీపడుతూ, ఎంతో వత్తిడికి గురయ్యే సచివాలయ ఉద్యోగులకు క్రీడలు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయని అన్నారు. మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యానికి దోహదపడే క్రీడా పోటీలను ప్రతి ఏడాది సచివాలయ ఉద్యోగులు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. అటు వంటి క్రీడాపోటీల్లో వయస్సుతో ప్రమేయం లేకుండా ఉద్యోగులు అందరు పాల్గొని మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని పొందాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ క్రీడా పోటీలను ఒక క్రమ పద్దతిలో నిర్వహించేందుకు ఇక పై శాప్ బాధ్యత వహిస్తుందని, ప్రతి ఏడాది శాప్ ఈ క్రీడా పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేస్తుందని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు నిత్యం ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు క్రీడల్లో పాల్గొనాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఏడాదికి ఒక సారి మాత్రమే క్రీడా పోటీలను నిర్వహించినంత మాత్రాన ఎటు వంటి ఫలితం ఉండదన్నారు. సచివాలయంలోని అన్ని విభాగాల ఉద్యోగులు వారి విభాగాల్లో క్రీడా క్లబ్ లను ఏర్పాటు చేసుకొని విభాగాల వారీగా ప్రతి మాసం మరియు త్రైమాసికంలో క్రీడా పోటీలను నిర్వహించుకుంటే ఉద్యోగులు అంతా ఆరోగ్య పరంగా ఎంతో ఫిట్ గా ఉంటూ విధులను మరింత ఉత్సాహంతో నిర్వహించగలుగుతారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అద్యక్షుడు కె.వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు అందరికీ 13 ఈవెంట్స్ లో క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందని, ఈ పోటీల్లో దాదాపు 660 మంది ఉద్యోగులు విజేతలుగా నిలిచారన్నారు. వీరందరికీ నేడు బహుమతులను ప్రధానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సచివాలయంలో క్రీడలను ప్రోత్సహించేందుకు, క్రీడా పోటీలను నిర్వహించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న రూ.10 లక్షలను రూ.20 లక్షలకు పెంచాలని మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు అందరూ పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *