అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుడు మరియు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను జూన్ 27వతేదీ నుండి జూలై 4వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర యువజన సంక్షేమం మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలియజేశారు.ఈమేరకు సోమవారం జిల్లా కలక్టర్లకు సర్కులర్ ఆదేశాలను జారీ చేశారు.ఈ వేడుకల్లో భాగంగా అన్ని జిల్లాల్లో విద్యార్ధిణీ విద్యార్ధులకు సంగీత విభావరి,నాటికలు,దేశభక్తి గేయాలాపన, ఊరేగింపులు,సైకిల్ ర్యాలీలు,రక్తదాన శిబిరాలు,యోగా,పొటోగ్యాలరీ,పెయింటింగ్,వ్యాస రచన, రంగోలి పోటీలు,స్వాతంత్ర్యోద్యమంలో అల్లూరి సీతారామరాజు పాత్రపై ఆయన జీవిత విశేషాలపై ప్రత్యేక ఏకపాత్రాభినయం వంటి కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన జిల్లా కలక్టర్లకు వ్రాసిన లేఖలో తెలియజేశారు.ప్రజలు,ప్రభుత్వం కలిసి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకులను ఘనంగా నిర్వహించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
బ్రిటిష్ పాలకుల కబంధహస్తాల నుండి మాతృభుమిని కాపాడేందుకు అల్లూరి సాగించిన పోరాట స్పూర్తిని మననం చేసుకునేందుకు వీలుగా అల్లూరి సీతారామ రాజు జయంతి వేడుకలను రాష్ట్ర వేడుకగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ప్రతి యేటా నిర్వహించు కుంటున్నవిషయం విధితమేనని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ కలక్టర్లకు వ్రాసిన లేఖలో పేర్కొన్నారు.1897 జూలై 4న జన్మించిన అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజల హక్కుల కోసం పోరాడి 27 ఏళ్ళ చిన్నవయస్సులోనే అనగా 1924 మే 7న మరణించారని తెలిపారు.ముఖ్యంగా స్వాతంత్ర్య ఉద్యమంలో సీతారామర రాజు జరిపిన సాయుధ పోరాటం ఒక ప్రత్యేక అధ్యాయమని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ పేర్కొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …