విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ మరియు పరమ్ టెక్నాలజీస్ ఇంక్, యుఎస్ఏ మరియు ఎఫిసెన్స్ సిస్టమ్స్ కెనడా డైరెక్టర్ అయిన అరసవిల్లి అరవింద్ ని భారతదేశ 75వ మహోత్సవాల సందర్భంగా ఇండో కెనడా గాలాలో , ఒట్టావాలోని హైకమిషన్ ఆఫ్ ఇండియా అజయ్ బిసారియ సత్కరించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అరవింద్ అరసవిల్లి మాట్లాడుతూ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తమ కృషిని ఇండో కెనడా ఛాంబర్ గుర్తించడం గొప్ప గౌరవమని అని, ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ గత దశాబ్ద కాలంగా భారతీయ విద్యార్థులను కెనడాకు పంపుతోందనీ ఇప్పటి వరకు తమ ద్వారా -కెనడాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు పంపబడిన చాలా మంది విద్యార్థులు, తమ గ్రీన్ కార్డ్లను పొంది కెనడాలోని అగ్రగామి సంస్థలలో పనిచేస్తున్నారనీ తెలియజేశారు. కెనడాలోని ఎఫిసెన్స్ సిస్టమ్స్ మెరుగైన పనితీరు కనబరచడం కోసం మరియు క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధిత సాఫ్టువేర్ లను రూపొందించడానికి కెనడా లోని స్థానిక సంస్థలలో కలిసి పనిచేస్తుందని ఇప్పటి వరకు, కెనడాలోని ఎఫిసెన్స్ సిస్టమ్స్ 22 ప్రాజెక్ట్ లను పూర్తి చేసింది మరియు టొరంటో & మాంట్రియల్ లో 60 మంది ఉద్యోగులతో ప్రస్తుతం 17 ప్రాజెక్ట్ లో పని చేస్తోందనీ తెలియజేశారు. ఈ సందర్భంగా, అల్బెర్టా రాష్ట్ర కాల్గరీ-ఎడ్జ్ మాంట్ ఎమ్మెల్యే మరియు మౌలిక సదుపాయాల మంత్రి ప్రసాద్ పాండా తో అరవింద్ సంభాషించారు. ప్రసాద్ పాండా మద్దతుతో, ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ అంతర్జాతీయ విద్యార్థులు అల్బెర్టాలో చదువుకోవడానికి కొత్త అవకాశాలను సృష్టించుకుంటుందని ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ తన సామర్ధ్యాన్ని అల్బెర్టాలో విస్తరించడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో అన్షుమాన్ గౌర్, డిప్యూటీ హై కమీషనర్, ఒట్టావా, మరియు కెనడా, టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అపూర్వ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …