విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పాఠశాలలో చదువుకొని 2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాదించిన విద్యార్ధిని, విధ్యార్ధులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అభినందనలు తెలియజేస్తూ, తదుపరి విద్యాబ్యాసంలో మరిన్ని విజయాలను సాధించి మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. April,2022 లో నిర్వహించబడిన 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో విజయవాడ నగర పాలక సంస్థ 29 ఉన్నత పాఠశాలల నుండి ఇంగ్లీష్ మీడియo నందు హాజరైన విద్యార్థులు : 2519 ఉత్తీర్ణులైన విద్యార్థులు : 1228 ఉత్తీర్ణత శాతం : 49% తెలుగు మీడియం నుండి హాజరైన విద్యార్థులు : 156 ఉత్తీర్ణులైనవారు : 37 ఉత్తీర్ణత శాతం : 23% ఉర్దూ మీడియం నుండి హాజరైన వారు : 53 ఉత్తీర్ణులైనవారు : 44 ఉత్తీర్ణత శాతం :83% నాలుగు ఉర్దూ మీడియం పాఠశాలలో SNMC ఉర్దూ బాలికల ఉన్నత పాఠశాల, వించిపేట నందు 100% ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా APJAKMC ఉర్దూ హై స్కూల్, అరండల్ పేట 88% తో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో SBVSRMCHS, కండ్రిక విద్యార్థులు 75% ఉత్తీర్ణత సాధించారు, VMRRMCSGHS, బాలికలు ఉన్నత పాఠశాల 70% ఉత్తీర్ణత సాధించారు, GDECHS, పటమట విద్యార్థులు 67% ఉత్తీర్ణత పొందారు.
Tags vijayawada
Check Also
సీఎం హామీ ఇచ్చారు.. కలెక్టర్ అమలు చేశారు
-ఉల్లంగుల ఏడుకొండలుకు ఎయిర్ కంప్రెషర్ అందజేసిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావు పేట, నేటి పత్రిక ప్రజావార్త : …