Breaking News

రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, కరోనా వపత్తు వచ్చి ఆదాయ వనరులు లేకపోయినా ఋణ మాఫి, సున్నా వడ్డీ పధకాలు అమ లు చేసాం.

-రాష్ట్ర హోం మంత్రి డా. తానే టి వనిత

చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, కరోనా విపత్తు వచ్చి ఆదాయ వనరులు లేకపోయినా ఋణ మాఫి, సున్నా వడ్డీ పధకాలు అమలు చేసామని రాష్ట్ర హోం మంత్రి డా. తానే టి వనిత అన్నారు.

సోమవారం చాగల్లు మండలం నందిగంపాడు గ్రామం లో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం లో రాష్ట్ర హోం మం త్రి డా. తానేటి వనిత పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గత ప్రభుత్వము చేయలేని అభివృద్ధి ని జగనన్న ప్రభుత్వం చేసిందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు రు.45.51 కోట్ల మేర సున్న వడ్డీ రాయతీ ని అందించామన్నారు. కొవ్వూ రు నియోజకవర్గ స్థాయిలోని 4576 గ్రూపులో ఉన్న మహిళ లకు రు.6.68 కోట్ల మేర సున్న వడ్డీ రాయతీ నేరుగా వారిబ్యాంకు ఖాతాకు జమ చేశామన్నా రు. చాగల్లు మం డల పరిధి లోని 1469 మంది గ్రూపులకు రు.2.57 కోట్ల సున్న వడ్డీ రాయి తీ గ్రూప్ సభ్యుల ఖాతాలో జమ చేశామన్నారు. అమ్మఓడి, ఋణ మాఫీ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి బృహత్తర పధకాలు పేద ప్రజ లకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. పేదవాడి సొంత ఇంటి కల నిరవేర్చే దిశగా, రాష్ట్రంలో 32 లక్షలకు పైగా ఉచితంగా ఇళ్ల స్థలలు పట్టాలు ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇవ్వండం జరుగుతొందన్నారు. అర్హత ఉండి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి స్థలం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని, అర్హులకు అన్ని సంక్షేమ పథకాలను అందచెయ్యలని వనిత పేర్కొన్నారు. మంత్రి తానేటి వనిత ఇంటింటికి వెళ్లి ఈ 3 సంవత్సరాలు గా ప్రభుత్వం అంద చేసిన సంక్షేమ పధకాలను వివరించారు. స్థానిక సమస్య లను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామంలో మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో యం. పి. పి. మట్టా వీరాస్వామీ,గ్రామ సర్పం చ్, కె. రాము,ఎంపీటీసీ సభ్యు లుఆతుకూరి దొరయ్య గ్రామ సర్పం చులు ఎంపీటీసీ సభ్యు లు కొవ్వూరు నియోజకవర్గ నా యకులు, ఎంపీడీవో బి. రామ్ ప్రసాద్, మండల తాహి సీల్దార్, శ్రీనివాస్, సచివాలయం సిబ్బం ది రెవెన్యూ అధికారులు తది తరులు పాల్గొన్నారు

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *