Breaking News

సందర్శకులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా పనులు పూర్తి చేయాలి…

-రాజీవ్ గాంధీ పార్క్ ఆధునీకరణ పనుల పరిశీలన
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్నారులకు వినోదభరితమైన ఆట పరికరాలతో పాటుగా ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీర్చుకొనే విధంగా రాజీవ్ గాంధీ పార్కు లో జరుగుతున్న ఆధునీకరణ పనులను మంగళవారం కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ అధికారులతో కలసి పర్యవేక్షించి చేపట్టిన పనులు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. నగరానికి వచ్చు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించుటతో పాటుగా చిన్నారులకు వినోదభరితమైన ఆట పరికరాలతో ఆనందాన్ని అందించే విధంగా పి.పి.పి పద్దతిలో చేపట్టిన పనులు అన్నియు తక్షణమే పూర్తి చేయునట్లుగా చూడలని అధికారులను ఆదేశించారు. పార్క్ ఆవరణలో ఇంకను చేపట్టవలసిన ఇంజనీరింగ్ మరియు గ్రీనరీ ఆధునీకరణ పనులు యుద్దప్రాతిపధికన పూర్తి చేయాలని అన్నారు. పార్క్ ను నందు సందర్శకులకు అందుబాటులో ఉండేలా క్యాంటిన్, త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సౌకర్యాలతో పాటుగా వాహనముల పార్కింగ్ ప్రదేశాన్ని కూడా సిద్దం చేసి వారం రోజులలో పార్క్ సందర్శకులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం,ప్రభాకరరావు, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఉద్యానవన అధికారి శ్రీనివాసు, పార్క్ సూపర్ వైజర్ మరియు కాంట్రాక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *