-భూ యజమానులకు చట్టం పై గ్రామ సభలు ద్వారా అవగాహన కల్పించాలి
-జాయింట్ కలెక్టర్ శ్రీధర్
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 72,071 మంది కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులను పంపణీ లక్ష్యంగా నిర్ధేదించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం జిల్లాలోని మండల, డివిజన్ స్థాయి అధికారులతో ఆర్డీవో ఎస్. మల్లిబాబు తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ శ్రీధర్ మాట్లాడుతూ, పంట సాగు హక్కు పత్రాలను 11 నెలల కాల పరిమితి తో ప్రతి ఒక్క కౌలు రైతులకు అందచెయ్యల్సి ఉందన్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయిందని, కౌలు రైతులకు తగిన ఆర్థిక చేయూత అందించడం లో సి సి ఆర్ సి కార్డ్ దారులకు బ్యాంకులు ముందుకు వస్తాయని తెలిపారు.సోమవారం నాడు వాలంటీర్లు వ్యవసాయ. సాగు పంట పత్రాలు గురించి భూ యజమానులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్డుల జారీ చేయడం వల్ల పంట కొనుగోలు, బీమా పథకం వర్తింపు, పంట నష్టం పరిహారం అందేచేసేందుకు అవకాశం కలుగుతుందని జేసీ తెలిపారు. ప్రతి గ్రామం లో వ్యవసాయ సహాయకుడు, గ్రామ రెవెన్యూ అధికారి గ్రామ సభలు నిర్వహించాలన్నారు. గ్రామ సభ ద్వారా గుర్తించిన కౌలు రైతులకు సాగు హక్కు పత్రం అందచేసే లా పేర్లు నమోదు చేయాలన్నారు. మండల అధికారులు ఈప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు. కౌలు రైతులకు సాగు హక్కు పత్రం అందచెయ్యడంలో భూ యజమానులు ఎటువంటి అపోహలు వద్దని, 11 నెలల కాలపరిమితిని ఈ కార్డులు కలిగి ఉంటాయన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో ఎస్. మల్లిబాబు, ఏ డీ ఏ చంద్ర శేఖర్, ఎమ్ ఏ ఓ వేణుగోపాల కృష్ణ, ఏం అర్ ఓ నాగరాజు నాయక్, తదితరులు పాల్గొన్నారు.