Breaking News

వ్యవసాయం లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసాం

-పైడిమెట్ట ఎత్తిపోతల పధకం నుండి సాగు నీరు పంపిణీకి స్విచ్ఛాన్ చేసీ ప్రారంభించాం
– రాష్ట్ర హోంశాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత

తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయం లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని ప్రతీ గ్రామం లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసామని రాష్ట్ర హోంశాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు.

శనివారం సాయంత్రం మంత్రి పైడిమెట్ట ఎత్తిపోతల పధకం నుండి సాగు నీరు పంపిణీకి స్విచ్ఛాన్ చేసీ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, రైతులకు సాగునీటికి ఇబ్బంది లేకుండా పైడిమెట్ట ఎత్తిపోతల పథకం నుండి సాగు నీరు విడుదల చేస్తున్నామని తానేటి వనిత పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ లో వివిధ అభి వృద్ధిపనుల కోసం ప్రభుత్వాన్ని నిధులు కోరినట్లు ఆమె తెలిపారు. ఖరీఫ్ సీజన్లో జూన్ నెలలో సాగునీరు అందించడం జరుగుతోందన్నరు. ఖరీఫ్ కంటే ముందుగా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించామని , గత ఖరీఫ్ సీజన్లో నష్ట పోయిన పంటకు ఉచిత బీమా పథకం నష్ట పరిహారం వారి ఖాతాల్లో జమ చేసి, వారికి భరోసాగా నిలుస్తున్నా మన్నారు.ఈ ప్రభుత్వం రైతు పక్ష పాత ప్రభుత్వం అని, ఆర్బికే ల ద్వారా ఎరువులు, విత్తనాలు అందించి అండగా నిలుస్తోందని తెలిపారు.

ఎత్తిపోతల పథకం అధ్యక్షులు కాకర్ల వెంకటేశ్వర్లు, రైతుల నుండి నీటి తీరువా కింద కోటి 60 లక్షల రూపాయలు రావాల్సి ఉందని రైతులంతా సహకారం అందిస్తే ఎత్తిపోతల పథకాన్ని సక్రమంగా నడిపించేందు కు అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత్తం ఎత్తిపోతల పరిధిలోని 9 శివారు ప్రాంతాలకు 3696 ఎకరాల కు సాగునీరు అందిస్తున్నా మన్నారు.

ఈ కార్యక్రమం లో కాకర్ల చంద్ర శేఖర్, జెడ్పి వైస్ చైర్మన్ శ్రీలేఖ, బండి పెట్టాభిరామారావు, పరశురామారావు, డి ఈ, పి. దుర్గా గురవయ్య, ఎత్తిపోతల పధకం డైరెక్టర్లు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *