అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త :
అనంతపురం పోలీసు శిక్షణా కళాశాల (పిటిసి)లోని ఆడిటోరియంలో ” సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ TOT కోర్సు-2022″ పై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండీ విచ్చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి IPS పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాల దర్యాప్తు అత్యంత కీలకంగా మారింది. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటూ వేరే ప్రదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల అకౌంట్లను ట్యాంపర్ చేయడం, డబ్బు దోచుకోవడం తరుచూ జరుగుతున్నాయి. లోన్ కావాలనో, లాటరీ తగిలిందనో నమ్మబలుకుతూ ఓటిపి నంబర్ సేకరించి తద్వారా బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తుండటం వంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రాకమైన నేరాలపైన పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల బాధితులు పోలీసు స్టేషన్లకు వచ్చినప్పుడు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండే పరిస్థితులు అక్కడక్కడ ఉన్నాయి. ఇలా ఉండకూడదు. కచ్చితంగా దర్యాప్తుపై అవగాహన ఉండాలి. ఈ శిక్షణలో నేర్చుకున్సది మీ స్టేషన్లకు వెళ్లి మిగితా వారికి తెలియజేస్తే మంచి ఫలితాలు ఉంటాయనే అనే ఊదేశం తో ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. సైబర్ నేరాలపై ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఏ ప్రొఫార్మాలో ఉండాలి, ఎలా డిటెక్ట్ చేయాలి, అఫెండర్ ఎవరు, అకౌంటును ఏవిధంగా సీజ్ చేయాలో తెలిస్తే మళ్లీ డబ్బు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు.. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేలా నైపుణ్యం పెంపోన్దించులోవలని సూచించారు. ఇటీవల కాలంలో అధికమైన ఈ నేరాల ఛేదింపు సమాజానికి అవసరమన్నారు.