-‘‘అమ్మ’’ లా అదరించి విద్యపట్ల ఆశక్తిని కల్పించాలి..
-‘‘అమ్మ’’ సేవలు స్పూర్తిదాయకం..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి ఉన్నత విద్యను అందుకునేందుకు ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) అందిస్తున్నసహకారం మరువలేనిదని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అమ్మ కళ్యాణమండపంలో పేద విద్యార్థిని విద్యార్థులకు ఉపకారవేతనాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరై ఉపకారవేతనాలు నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుటుందన్నారు. దాతల భాగస్వామ్యం తోడైతే విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయగలుగుతామన్నారు. సహజంగా ఆటోమొబైల్ రంగంలో పనిచేసేవారు పేద కుటుంబాలకు చెందిన వారై
ఉంటారన్నారు. వారి పిల్లలకు మంచి విద్య బోదన అందించేందుకు ఆర్థిక చేయుతను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు ఆటోమొబైల్ రంగంలో పనిచేసే కుంటుంబాల వారిని అమ్మ లా ఆదరించడం అభినందనీయమన్నారు. గత 24 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి ఏటా విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తున్నారని ఈ ఏడాది 300 మంది విద్యార్థులకు 12 లక్షల రూపాయల ఉపకార వేతనాలు నోట్ పుస్తకాలను పంపిణీ చేయడంతోపాటు రెండు ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలందించడం గొప్ప విషయమన్నారు. మొగల్రాజుపురంలోని బోయపాటి శివరామకృష్ణయ్య మున్సిపల్ పాఠశాలలను దత్తత తీసుకుని ముగ్గురు కంప్యూటర్ టీచర్లకు జీతాలను చెల్లించడంతోపాటు పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం ద్వారా నగరంలోనే ఉత్తమ పాఠశాలగా గుర్తింపు తీసుకువచ్చారన్నారు. దాతలు అందించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుని విద్యారంగంలో రాణించాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. పిల్లలు ఆశక్తిగా విద్యాను అభ్యసించేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సిఎన్‌ఆర్‌రావు మైఖేల్ ఫేర్డ్ హాన్స్ బెతే వంటి ప్రముఖ శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకుని ఆశక్తిని పెంచుకుని ఎదో ఒకటి సాధించాలనే ఆలోచన దృపదం కల్పించుకోవడం ద్వారా భవిష్యత్‌లో మంచి విద్యావంతులుగా రాణించాలన్నారు. అమ్మ సంస్థ భవిష్యత్‌లో నిర్వహించే కార్యక్రామలకు ప్రభుత్వ సహకారం అందింస్తామని అవసరమైన సమయంలో వారి సేవలను వినియోగించుకుని సంయుక్తంగా సేవ కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ అభ్యక్షులు మిరియాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమ్మ అసోసియేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆటోనగర్ గవర్నపేటలో ఆటోమొబైల్ షాపులలో పనిచేసే సిబ్బంది కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు 1999వ సంవత్సరం నుండి కోటి రూపాయల ఆర్థిక సహయాన్ని నోట్ పుస్తకాలను అందించడం జరిగిందన్నారు. కానురులో 60 లక్షల రూపాయలతో వృద్దాశ్రమంను నిర్మించి 40 మంది వృద్దులకు ఉచితంగా ఆశ్రయం కల్పిస్తున్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాలలో సంభవించినప్పుడు భాధితులకు సహాయ సహకారం అందిస్తున్నామని కరోనా సమయంలో రోగులకు ప్రతి రోజు ఉచితంగా భోజన ఏర్పాట్లు కల్పించడంతోపాటు రైతాంగానికి విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. బోయపాటి శివరమకృష్ణయ్య పాఠశాలలో దత్తత తీసుకుని అభివృద్ధి చేయిచడంతోపాటు ప్రతి ఏడాది 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజులను చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సుంకర చంద్రశేఖర్, జి. సతీష్‌కుమార్, ఎ. ప్రసాద్‌రావు, జివి సుబ్బారావు, అనే శ్రీనివాస్‌రావు, యార్లగడ్డ సుబ్బారావు, అసోసియేషన్ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News